ఉషోదయం
"ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి రాత్రి పైరగాలి,
బ్రతుకంతా ప్రతి నిమిషం, పాట లాగ సాగాలి,
ప్రియా, ప్రియా, పాట లాగ సాగాలి "
జీవితం లోని ప్రతి క్షణాన్ని అందంగా మలచుకోవాలని,
ప్రతి అనుభూతిని ఆస్వాదించాలని, బ్రతుకంతా ఒక తీయని
పాట లాగ సాగిపోవాలని,
ఎన్ని కలలు కన్నాను,
ఎన్ని రమ్యహర్మ్యాలు నిర్మించుకున్నాను,
ఎన్ని ఆశల పందిళ్ళు వేసుకున్నాను.
ఆ పందిళ్ళ వాకిట తొలి పొద్దునై, మలి సంధ్యనై వెలిగిపోవాలని
ఎంతగా ఉవ్విళ్ళూరాను.
ఏవీ అవన్నీ,
గుడికే చేరని దీపాలైన నా ఆశలు,
కలల ప్రమిదలలో కర్పూరంలా కరిగిపోయిన నా కోరికలు,
మూసిన కనురెప్పల చాటున కన్నీటి దారుల్లో మిగిలిపోయిన
నా రేపటి స్వప్నాలు,
అనుక్షణం జీవన పోరాటంలో అలసిన మనసు,కరిగిపోయే కాలంతో పాటు జీవితం అలా చేజారిపోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయత, భరించలేని నిర్లిప్తత.

ఒంటరితనం నేస్తమై, నిశ్శబ్దం నా చుట్టూ అల్లుకున్న వేళ ,
నాకు నేనే తోడునై, ఓదార్పునై ఇలా ఎన్నినాళ్ళో.
ఐనా ఏదో ఆశ.
ప్రతి ఉదయం మేలుకొలిపే రవికిరణంలా,
ఓ కొత్త ఉషోదయం నా కోసం వేచి ఉందనీ,
వాసంత సమీరాలు అలలై నన్ను పలుకరిస్తాయని,
రేపటి జీవితం నాదేనని,
చిన్న ఆశ.
ఓ కొత్త ఉషోదయం నా కోసం వేచి ఉందనీ,
వాసంత సమీరాలు అలలై నన్ను పలుకరిస్తాయని,
రేపటి జీవితం నాదేనని,
చిన్న ఆశ.
Post a Comment
6 comments:
బాగుందండీ మీ ఆశ! :)
థాంక్స్ మధుర గారూ
నిజమే. ఆశే మనల్ని నడిపించేది, ఇవ్వాళ్తికంటే రేపు ఏదో మెరుగ్గా ఉంటుందనే ఆశే
అవునండీ,
థాంక్యూ వెరీమచ్ కొత్తపాళీ గారూ
మీ ఆశ బాగుందండీ
థాంక్స్ మంజు గారూ
Post a Comment