కాకరకాయ కారం,శనగపప్పు కారం,నల్ల కారం
కాకరకాయ కారం :
కావలసిన పదార్ధాలు :
కాకరకాయలు రెండు
జీలకర్ర రెండు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు పది
ఉల్లిపాయ ఒకటి చిన్నది
పచ్చి కారం మూడు స్పూన్లు
ఉప్పు తగినంత
మజ్జిగ ఒక కప్పు
చింతపండు చాలా కొంచెం (ఒక్క తోలు)
నూనె ఒక కప్పు
పసుపు చిటికెడు
తాలింపుకు :
శనగపప్పు ఒక స్పూను
మినప్పప్పు ఒక స్పూను
ఆవాలు అర స్పూను
ఎండుమిర్చి రెండు మూడు
కరివేపాకు రెండు రెమ్మలు
వెల్లుల్లి రెండు రెబ్బలు
వెల్లుల్లి రెండు రెబ్బలు
తయారు చేసే విధానం :
కాకరకాయలు చక్రాల్లా తరగాలి. ఒక కప్పు మజ్జిగలో చిటికెడు
పసుపు,కొంచెం ఉప్పు, చింతపండు , కాకరకాయ ముక్కలు వేసి,
పసుపు,కొంచెం ఉప్పు, చింతపండు , కాకరకాయ ముక్కలు వేసి,
మజ్జిగ ఇగిరిపోయి ముక్కలు పొడి గా వచ్చేంతవరకు ఉడకపెట్టాలి.
పచ్చికారం,జీలకర్ర, వెల్లులి మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి, అందులో
ఉల్లిపాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా ఒకసారి తిప్పి
కచ్చాపచ్చాగా ఉండేట్టు గ్రైండ్ చేసుకోవాలి.
నూనె వేడి చేసి ఉడికించిన కాకరకాయ చక్రాలని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే నూనెలో (వడకట్టి) శనగపప్పు,మినప్పప్పు ఆవాలు,
ఎండుమిర్చి ,వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు వేసుకుని,కరివేపాకు కూడా వెయ్యాలి
అవి వేగాక నూరిన ముద్ద వేసి, సరిపడా ఉప్పు చల్లి , పచ్చిదనం
పోయేవరకు బాగా వేయించాలి.తరువాత వేయించిన కాకరకాయ ముక్కలు
వేసి ఈ కారం అంతా ముక్కలకు పట్టేలా బాగా కలిపి సన్నని సెగపై రెండు
నిమిషాలు వేయించుకోవాలి.
పొడిపొడిగా కాకరకాయ కారం రెడీ అవుతుంది.
శనగపప్పు కారం:
కావలసిన పదార్ధాలు
వేయించిన శనగపప్పు
(పుట్నాలపప్పు) రెండు కప్పులు
ఎండుమిర్చి పది
ఎండుకొబ్బరి అర చిప్ప
జీలకర్ర రెండు స్పూనులు
ఉప్పు తగినంత
వెల్లుల్లి పది రెబ్బలు
నూనె ఒక స్పూను
తయారు చేసే విధానం :
నూనె వేడిచేసి ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి
ఎండుమిర్చి,ఉప్పు ,జీలకర్ర ,ఎండుకొబ్బరి , వెల్లుల్లి మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు సెనగపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక బౌల్ లోకి తీసుకుని అంతా కలిసేలా బాగా కలిపి బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
కరివేపాకు కారం (నల్లకారం):
కావలసిన పదార్ధాలు:
కరివేపాకు రెండు కప్పులు
ఎండుమిర్చి పది
ధనియాలు నాలుగు స్పూన్లు
శనగపప్పు రెండు స్పూన్లు
మినప్పప్పు రెండు స్పూన్లు
ఎండుకొబ్బరి చిన్న ముక్క
జీలకర్ర రెండు స్పూన్లు
వెల్లుల్లి పది రెబ్బలు
చింతపండు కొంచెం
ఉప్పు తగినంత
నూనె నాలుగు స్పూన్లు
తయారుచేసే విధానం :
నూనె వేడిచేసి శనగపప్పు,మినప్పప్పు ,ధనియాలు దోరగా వేయించుకుని తీసుకోవాలి.
తరువాత ఎండుమిర్చి కూడా దోరగా వేయించుకోవాలి.
తరువాత కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసి బాగా వేయించాలి.
ఇప్పుడు ముందు శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర,
ఎండుకొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి,తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి,
చివరగా వేయించిన కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.
ఈ రెండు కారంపొడులలొనూ ఎవరి రుచిని బట్టి వారు ఎండుమిర్చి
ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు.అలాగే నల్లకారం లో చింతపండు కూడా
పులుపు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.
ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు.అలాగే నల్లకారం లో చింతపండు కూడా
పులుపు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.
Post a Comment
5 comments:
లతగారు అన్ని కారాలు బాగున్నాయి..అయితే మీరు తయారు చేసే విధానంతో పాటు తయారయిన తర్వాత అవి ఎలావుంటాయో చూడటానికి ఒక ఫొటో కూడా జోడిస్తే బాగుంటుంది...ఇలా చెయ్యటం వల్ల మేము చేసేది మీరు చేసిన వాటికి సరితూగుతుందో లేదో చూస్కునే అవకాశం కలుగుతుంది..
బోలెడు నెనర్లు. చేసి ఎలావచ్చిందో చెబుతాను
కొత్తపాళీ గారూ,
నేనూ నిన్న చేశాను అండీ. ఫొటో పెడదాము అంటే కెమేరాలో ఏదో ప్రాబం వచ్చింది.సరే లేట్ చెయ్యడం ఎందుకని పోస్ట్ రాసేశాను .
థాంక్యూ.
రాజ్ గారూ,
నచ్చినందుకు థాంక్స్ అండీ,
కెమేరా ప్రాబ్లం వల్ల ఫొటొస్ పెట్టలేకపొయాను.
ఫొటోస్ కోసం దీని ముందు పొస్ట్ చూడండి
Nenu try chesanu bane vachhayi. Thank u
Post a Comment