మళ్లీ జన్మిస్తా, కే.కే స్వరం లో
చాలా రోజుల క్రితం ఏదో చానెల్ లోఈ పాట విన్నాను. అబ్బ బావుంది
అనుకున్నాను కానీ ఏ సినిమా లోదో తెలియలేదు.
అనుకున్నాను కానీ ఏ సినిమా లోదో తెలియలేదు.
నిన్న ఎందుకో గుర్తొచ్చి వెదికితే తెలిసింది. ఇది మా అశోక్ గాడి లవ్ స్టొరీ
సినిమాలోది అని.ఆ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందో నాకు
తెలియదు. కానీ ఈ పాట ఎంత నచ్చిందో చెప్పడానికి మాత్రం మాటలు లేవు.
గొప్ప సాహిత్యానికి,అందమైన బాణీ కడితే అది అద్భుతంగా
గాయకుని స్వరం లో ఇమిడిపోతే ఇలాగే ఉంటుంది ఏమో అనిపించింది.
ప్రేమ లోని వేదన ఇంత తీవ్రమా అనిపిస్తుంది ఆ హై పిచ్ లో కేకే స్వరం వింటే.
ఈ పాట నిన్నంతా నన్ను వెంటాడుతూనే ఉంది.ఎవరు రాశారా అని మళ్లీ
చూశాను. ఇంకెవరూ ఇంత గొప్పగా రాసేది అనిపించే వన్ అండ్ ఓన్లీ శ్రీ
వేటూరి.
మళ్లీ జన్మిస్తా,మళ్లీ జన్మిస్తా
నువ్వు నేను ఏకం అయ్యే వరకూ
మళ్లీ ప్రేమిస్తా,మళ్లీ ప్రేమిస్తా
నీకై పుట్టి నిన్నే చేరేవరకూ
నిన్నే ప్రేమిస్తా
ఓహో ప్రియా ఈ మధూదయం లో ఇదేలే నా బాస
ప్రియా ప్రియా నీ సమాగమం లో ఇదేలే నా ఆశ
మళ్లీ జన్మిస్తా
నీ శ్వాస లో ఊపిరాడాలి నాకు పొత్తిళ్ళలో పాపలా
నీ పాపలా ఊయలూగాలి నేను కౌగిళ్ళలో ప్రేమలా
స్నేహమల్లే సాగేపోయే, దాహమేదో రేగే నాలో
చెలీ చెలీ ఆశలు నాలో ప్రియా ప్రియా
మళ్లీ జన్మిస్తా
మా అమ్మవై రూపం ఇవ్వాలి నాకు నా కంటికే చూపుగా
ఏ జన్మకూ తోడు కావాలి నువ్వు చుక్కానిలా చుక్కలా
బంధమేదో పెరిగే వేళ, బ్రతుకు తరిగే ఈ వేళ
నా నేను ప్రేమవు నీవే ప్రియా ,ప్రియా "మళ్లీ జన్మిస్తా "
Post a Comment
3 comments:
Nice song :)
అవును. వినగానే చాలా నచ్చేసింది.
థాంక్స్ ఇందూ
see this..:)
http://trishnaventa.blogspot.com/2010/12/blog-post_13.html
Post a Comment