"అశ్వనీచంద్ర "
ఇది మా బాబు పేరు దీని వెనుక చిన్న కధ ఉంది. సరదాగా రాస్తున్నాను.
పేరులో ఏముంది, పేరులోనే అంతా ఉంది. ఏమో.
మా బాబు అశ్వనీ నక్షత్రం లో పుట్టాడు.నిజానికి ఆ నక్షత్రం ప్రకారం చ ,ల, వీటితో మొదలయ్యే పేర్లు పెట్టాలి.ఏ చరణ్ అనో పెడితే బాగానే ఉండేది.నేను ఇలా తర్జన భర్జన పడుతుండగా, మా ఆస్థాన బ్రాహ్మడు {మా పెళ్లి చేయించింది కూడా ఆయనే లెండి} నక్షత్రం పేరే పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది.వాడు చాలా వృద్ధిలోకి వస్తాడు, అని "అశ్వనీకుమార్ " అని రాసి పంపించాడు.సరే బాగానే ఉంది కానీ కుమార్ మరీ పాతగా ఉంది వద్దు అనుకుని అది తీసేసి నేను చంద్ర తగిలించాను.ఓకే .వెరసి అశ్వనీచంద్ర అయ్యింది.
చాలా చిన్నప్పుడు అంతా చెందూ అని పిలిచేవారు. అబ్బే, నాకు ఎందుకో అదీ నచ్చక అశ్వీ అని పిలవడం మొదలుపెట్టాను.క్రమంగా అది అలవాటు అయిపోయింది.అంతవరకూ బాగానే ఉంది .
ఐతే తన బర్త్ సెర్టి ఫికేట్ లో ashwanichandra అని ఉంది.స్కూల్ లో ఎప్పుడూ ప్రాబ్లెం రాలేదు కనుక మాకూ ఆ ధ్యాస లేదు
ఇక ఇంజినీరింగ్ కి బిట్స్ పిలానికి వెళ్ళాక కష్టాలు మొదలయ్యాయి.అశ్వని వరకే చూసి పేపర్స్ ఆడపిల్లల వాటిలో కలిపేసే ప్రొఫెసర్స్, నలుగురిలో ఉండగా సడెన్ గా వచ్చి ఆర్ యు అశ్వని అని అడిగే ఆడపిల్లలు, నోరుతిరగక పేరుని ఖూనీ చేసే కొందరు ఇలా అన్నమాట.
ఇంతకంటే గొప్ప పేరు దొరకలేదా నీకు, నీ పేరు చూడు ఎంత షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుందో. నాది ఓ దిక్కుమాలిన పేరు,ఎవరికీ నోరు తిరిగి చావదు, అని మొత్తుకునేవాడు. అచ్చ తెలుగు పేరు దానికి ఏమైంది అంటే అది తెలుగు దానిలా ఎక్కడ ఏడ్చింది, h చేరి బెంగాలి పేరు అయ్యింది కదా అంటాడు.
ఈ విషయంలో అస్సలు నా ప్రమేయం లేదు అంతా మమ్మీదే అని హ్యాపీగా తప్పించేసుకుంటారు మా శ్రీవారు.
ఇవన్నీ చాలక ట్రైన్ రిజర్వేషన్ చేయించుకుంటే అక్కడ ఫిమేల్ అని పడుతుంది ఒకోసారి. టి.టి.లతో చిన్న గొడవ. ఐ.డి కార్డు చూపించి మరీ నమ్మించాలి. దిక్కుమాలిన పేర్లు పెడితే ఇలాగె ఉంటుంది అని మా వాడు లెక్చర్. ఏ రాం, టాం, జాన్ ఇలా ఏది పెట్టినా ఈ తిప్పలు తప్పేవి కదా అని వాపోతాడు.
ఇక చివరి ట్విస్ట్ ఏమిటంటే, మొన్న పోస్టింగ్ వచ్చి జాబ్ లో జాయిన్ అవడానికి వెళ్తే ఎకామడేషన్ గర్ల్స్ హాస్టల్ లో ఎలాట్ చేయడాలు, క్లైంట్ నుండి వచ్చే ఈ మెయిల్స్ లో మాడం అని రాయడాలు , ఇక అంతే ఫోన్ లో అరగంటసేపు నేను టార్గెట్ ఐపోయాను.
ప్చ్. ఏం చెయ్యను.అప్పుడు చిన్న వయసు. ఇంత దూరం ఆలోచించలేదు. కొన్ని కొన్ని వెనక్కి తీసుకోలేము కదా. సారీ నాన్నా.
కొసమెరుపు ఏమిటంటే, వాళ్ళ బెంగాలీ మేనేజర్ మాత్రం అష్వనీచంద్రా అని పూర్తి పేరుతో బ్రహ్మాండంగా పిలుస్తాడట.
అశ్వనీచంద్ర . ఏమిటో. ఇప్పటికీ నాకు ఈ పేరు డిగ్నిఫైడ్ గా చాలా బావుంటుంది. నేను పెట్టాను కనుక అంటారా.
Post a Comment
4 comments:
ledandi peru chakkagaa muchatagaa vundi.....evariki leni peru ani cheppandi.
థాంక్స్ మంజు గారూ, అలాగే చెప్తాను.
ఇలాంటి సంఘటనే మరోటి చెప్పనా! మా అమ్మాయి పేరు శశికిరణ్.ఒకరు శశిరేఖ అని పెట్టమని,మరొకరు కిరణ్మయి అని పెట్టమని,ఇక రెండు కలిపి అలా పెట్టేసాము.ఇంజనీరింగ్ చదివేటప్పుడు అటెండెన్స్ పిలిచి అబ్బాయిలవంక చూసేవారట!ఇంకేముంది మా అమ్మాయి మాపై సూర్యకిరణ్ అయ్యేది.నేములోనేముంది?అశ్వనీచంద్రకు ఆశీస్సులు.
థాంక్యూ ఉమాదెవి గారూ
Post a Comment