మనసుకి నేస్తాలు
చాలా చాలా రోజులు ఊహూ సంవత్సరాల తరువాత నిన్న వెన్నెల్లో ఆడపిల్ల నవల చదివాను.ఆ రోజుల్లో ఎంతగానో ఆకట్టుకున్న ఈ నవల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు.కానీ నాకు ఇప్పటికీ గుర్తు మొదటిసారి ఈ నవల చదివాక ఆఖరి పేజీ అయ్యేసరికి కళ్ళనిండా నీళ్ళతో మనసు భారమై చాలా సేపు అలాగే కూర్చున్నాను.ఇన్నేళ్ళ తరువాత చదివినా అదే అనుభూతి మనసుని తాకి పూర్తయ్యేసరికి కళ్ళు చెమర్చాయి.
ఒక మంచి పుస్తకం చదివితే,ఒక మంచి పాట వింటే వచ్చే ఆనందం ఇవే కదా ఒంటరిగా ఉన్నప్పుడు మనకి తోడుగా ఉండేవి. ఇంత చిన్న జీవితంలో ఎన్నని ఆస్వాదించగలం.అన్నీ కొంచెం కొంచెం చవిచూసేసరికే జీవితం అయిపోతుంది అంటుంది రమ్య ఈ నవలలో.
నిజమేనేమో
నిజమేనేమో
అసలు పుస్తకాలుంటే ఏమీ అక్కర్లేదు.చిన్నప్పుడు పరిక్షలు అయిపోయి సెలవులు వచ్చాయంటే చాలు అమ్మనడిగి నవలల లిస్టు అంతా రాసుకుని రెడీ అయిపోవడమే.ఊళ్ళో లైబ్రరీ ఉండేది రోజూ రెండు నవలలు ఇచ్చేవాళ్ళు.ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్లి తెచ్చేసుకుంటే మరునాటికి చదివేయ్యాలి.అదే కార్యక్రమం.అంతా నిద్రపోయాక,వేసవిలో ఆరుబయట పడుకుని వెన్నెల్లో పుస్తకం చదువుకుంటే వచ్చే అనుభూతి మర్చిపోగలమా.
అలా దాదాపు అన్ని నవలలూ చదివేశాను.తిరిగి కాలేజ్ కి వెళ్ళినప్పుడు లంచ్ టైం అంతా ఫ్రెండ్స్ తో ఇవే కబుర్లు.
ఆ అలవాటే ఇప్పటికీ ఉన్నా,ఇక్కడ లైబ్రరీ దగ్గరలో లేక నవలలు దొరక్క చదవడం కుదరడం లేదు.కానీ వీక్లీస్ మాత్రం మానలేదు.లెండింగ్ లైబ్రరీకి మెంబర్షిప్ కట్టి రోజూ ఒక వీక్లీ తీసుకుంటాను.
ఈ మధ్యే తెలిసింది ఈవెనింగ్ అవర్ అని లైబ్రరీలో బుక్స్ వారానికి రెండు రెంట్ కి ఇస్తారు అని మరి మా ఏరియాకి హోం డెలివెరీ ఉందొ లేదో కనుక్కోవాలి.ఉంటె మరోసారి అన్నీ పుస్తకాలూ చదవాలి ఎవరికైనా ఆసక్తి ఉంటే www.eveninghour.com చూడండి.
Post a Comment
6 comments:
Latha garu,
nice post.
today i read about books and reviews. Pls do visit http://gayathrimohit.blogspot.com/
thank you gayatri gaaru
వెన్నెల్లో ఆడపిల్ల ఎంత మంచి నవల..
హృదయానికి హత్తుకొనే గొప్ప ప్రేమ కావ్యం..
యండమూరి వారి శైలి అమోఘం..
ఒక చదరంగ ఆటగాడి ప్రేమ కథ ను సినిమాలో (ఈ వెన్నెల్లో ఆడపిల్ల కన్నడ భాష లో సినిమా గా కూడా వచ్చింది.(అనంత్ నాగ్ హీరో) .ఒక నవలను రివర్స్ స్క్రీన్ ప్లే టెక్నిక్ లో
చదవుతున్న ప్రేక్షకుడికి ఆ అనుభూతిని కలిగించిన రచయిత నిజంగా ఒక గ్రేట్ రైటర్...
యండమూరి నిజంగా సూపర్బ్..
అవును సాగర్ గారూ మంచి నవల
ఈ నవలను తెలుగులో కూడా సినిమాగా తీశారు.పేరు హలో ఐ లవ్ యూ అనుకుంటా
కానీ ఎంతో గొప్పగా తీస్తే తప్ప,నవల చదివితే వచ్చే అనుభూతి రాదండి
అందుకే సినిమా చూడలేదు .
ఈ నవల నాకు కూడా ఇష్టమండి. ముఖ్యంగా చివర్లో కన్నీటి చుక్క చెప్తున్నట్టు రాసిన మాటలు చాలా ఇష్టం.
అవును శిశిరగారు,మర్చిపొలేము ఆ వాక్యాలను
Post a Comment