పెళ్ళంటే
పెళ్ళంటే కళ్యాణమండపాలు, కటౌట్లు,భారీ అలంకరణలు, ఫోటో గ్రాఫర్లూ , వీడియోలు, కోలాహలం,హడావుడీ ఇదేనా.ఖచ్చితంగా కాదు
పెళ్ళంటే ఓ అందమైన అనుభూతి.రెండుమనసుల్నీ,జీవితాలనీ ముడివేసే అపురూపమైన ఘట్టం.మధురస్మృతిగా కలకాలం నిలుపుకోవలసిన అందమైన వేడుక.జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే పండగ.
అంత ప్రాముఖ్యత ఉన్న వేడుక హడావుడిగా ఎవరో తరుముకు వస్తున్నట్టు,
ఫోటోలకు ఫోజులివ్వడమే సరిపోయేట్టు,చుట్టూ మూగే స్నేహితుల అరుపులు,
కేకలు వీటన్నిటికంటే కాస్త ఉన్నవాళ్ళైతే చాలు పాటల కచేరీలు వీటి మధ్య జరుగుతోంటే చాలా వింతగా ఉంటోంది.
నిన్న అంగరంగ వైభవంగా జరుగుతోంది అని లైవ్ టెలికాస్ట్ ఇచ్చిన అల్లు అర్జున్ పెళ్లిని పదినిమిషాలు చూసేసరికి నిజంగా చిరాకు వచ్చింది.వెనుక
నుండీ పక్కనుండీ తోసుకుంటూ అక్షింతలు వేసేసే అతిధులు,ఎవ్వరికీ పెళ్లి కనపడకుండా మూగేసిన జనాలు చూసేవాళ్ళకే ఊపిరాడలేదు.దానికి తోడు పీటల మీద కూర్చుని ఒకటే కబుర్లు చెప్పెసుకుంటూ జోకులు వేసుకుంటూ ,ఏమిటో చాలా విచిత్రంగా ఉంది.ఇంత కంటే అతి ముఖ్యమైన వాళ్ళమధ్య ఆహ్లాదంగా పెళ్లి చేసుకుని,జనాలందరికీ రిసెప్షన్ ఇచ్చేపని కదా అనిపించింది.ఐతే అంత రష్ లోనూ,గందరగోళంలోనూ చేతిలో అక్షింతలు పట్టుకుని ఓపిగ్గా అక్కడే పది నిమిషాలు నించుని జీలకర్ర బెల్లం పెట్టాక మాత్రమే అక్షింతలు చల్లి దీవించిన బాలకృష్ణ సంస్కారం మాత్రం నచ్చింది.
సెలెబ్రిటీల పెళ్లి అంటే అంతేనేమో
సెలెబ్రిటీల పెళ్లి అంటే అంతేనేమో
ఆ మధ్య మా కజిన్ పెళ్ళిలో కూడా అంతే చుట్టూ స్నేహితులు చేరిపోయి అసలు స్టేజ్ మీద ఏమి జరుగుతోందో ఎవరికీ కనపడనివ్వలేదు.పెళ్లి వరకూ ఎందుకు ఉన్నామో కూడా అర్ధం కాలేదు.ఇక పాటల కచేరీ గురించి చెప్పనక్కర్లేదు గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అంటూ పెళ్ళిలో పాడటం. మొన్న మొన్న జరిగిన ఇంకో పెళ్ళిలో కూడా అక్షరాల లక్ష రూపాయలు పెట్టి గీతామాదురిని తీసుకొచ్చి ప్రోగ్రాం పెట్టారు.ఇవన్నీ అవసరమా. డబ్బులున్న జబ్బులు తప్ప. ఇక ఈ మధ్య పెళ్ళిళ్ళలో ఎప్పుడూ టైం దొరకదు అన్నట్టు అమ్మాయి, అబ్బాయి పీటలమీదే తెగ కబుర్లు చెప్పెసుకోవడం.ఇది మరీ విచిత్రం
ప్రతి మంత్రానికీ అర్ధం తెలుసుకుని చేసుకోమని కాదు కానీ,కనీసం మనసు పెట్టి ఇష్టంగా సంప్రదాయాన్ని ఆస్వాదిస్తూ చేసుకోవచ్చు కదా.అసలు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కానీ,తాళి కట్టినప్పుడు కానీ ఆ మంత్రాలు,హై పిచ్ లో బాండ్ శబ్దం వీటితో, చూసేవాళ్ళకే మనసు స్పందిస్తుంది .ఈక్షణం నుండి వీళ్ళిద్దరూ ఒక్కటి అన్నఉద్వేగంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి.అలాంటిది వధూవరులకి ఇంకెంత స్పందించాలి.
ఆహ్వానించుకుంటే కలకాలం ఆ మధురానుభూతి ఓ అందమైన కావ్యంలా మీ హృదయాల్లో నిలిచిపోతుంది.
Post a Comment
18 comments:
అందరికి అదే అనిపించింది లత గారు అల్లు వారి పెళ్ళంటే
ముందు పెళ్ళిల్లో ఆ ఫొటొగ్రాఫర్ ని, ,వీడియోగ్రాఫర్ ని కంట్ర్లోల్ చేయాలి... తాళి కట్టేటప్పుడుకూడా మధ్యలో దూరతారు...
బాగా చెప్పారు
బాగా చెప్పారు లతగారు
హహహ నిజమే ..బాగా చెప్పారు.
అవును మంజు గారూ
నిజమే సత్యగారూ
థాంక్యూ
మిరియప్పొడి గారూ,
సుమలత గారూ,
ఎన్నెల గారూ,
థాంక్యూ
బాగా చెప్పారు లత గారు. నేను అల్లు అర్జున్ పెళ్ళి చూడలేదు కాని ఖర్మ కాలి తాళి కట్టే సమయంలో ఓ నిమిషం చూసా..అబ్బా ఆ వెకిలి నవ్వు ..ఆ మాటలు చూసి ఇదేం వెకిలి చేష్టలు అనుకున్నా! అమ్మాయి మాత్రం చక్కగా హుందాగా ఉంది అనిపించింది!
ఈ మధ్య పెళ్ళిళ్ళలో ఫోటోలు వీడియోలు గొడవ బాగా ఎక్కువ అయిపోయి అసలు పెళ్ళి తంతుకి ప్రాధాన్యత లేకుండా అయిపోతుంది. ఈ మధ్య మా కజిను వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో ఫోటొగ్రాఫర్లని అడ్డంగా ఉన్నారని పక్కకి వెళ్ళమంటే మీరు స్క్రీన్స్ మీద చూడండి మేడం అని సలహ ఇచ్చాడు. అదేమంటే ఇవే (ఫోటోలు) కదండి తరువాత కావాల్సింది అన్నాడు.
Lata gaaru you took words from my mouth :)
ఐతే మువ్వ గారు చెప్పినట్లు ఆ అమ్మాయి మాత్రం చాల హుందా గా ఉంది .
కాకపోతే ఇలాంటి పెళ్ళిళ్ళ వల్ల గుడ్డి కన్నా మెల్ల మేలు అని ఒక ఉపయోగం ఉంది అది మనీ ఫ్లో అవుతుంది అది ఒక్కటే ఉపయోగం .
కాని వీళ్ళ ని చూసినప్పుడు మాత్రం నాకు రామోజీ , ప్రేమ్ జీ ఇలాంటి వల్ల మీద గౌరవం రెట్టింపు అవుతుంది !
ఈ మధ్య సెల్ గ్రాఫర్లు ( సెల్ ఫోన్లో పెళ్ళంతా షూట్ చేసెయ్యాలని ఉబలాటపడేవాళ్ళు) హడావిడి ఎక్కువయిపోయింది. ఇక బన్నీబాబు పెళ్ళికి భూదేవంత అరుగు వేసినా అంతా తొడటొక్కిడే . అయినా ఆ పెళ్ళేంటో అంత హడావిడిగా అయిపోయింది దానికోసం ఎంత ఖర్చుపెట్టివుంటారో ! అసలు ఎవరు వచ్చారో అయినా తెలుస్తుందంటారా
చివరి పేరా బావుంది ( అంటే మిగిలింది బాలేదనికాదండోయ్ )
సిరిసిరిమువ్వగారూ అవునండి అమ్మాయి బాగానే ఉంది.
ఫొటొగ్రాఫర్లు అలాగే అంటున్నారండీ ఏమి చేస్తాం
శ్రావ్యగారూ నిజమేనండీ
లలితగారూ నిజమే సెల్ గ్రాఫర్లను మర్చిపోయానండీ బాగా గుర్తుచేశారు
అందరికీ ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారండి. మొన్నామధ్య మా ఫ్రెండ్ పెళ్ళిలో వీడియో గ్రాఫర్ ఎవ్వరినీ మంటపం దగ్గరికి వెళ్ళనివ్వలేదు. వాళ్ళిద్దరినీ మాత్రమే కవర్ చేస్తూ ఒక డాక్యుమెంటరీ తీసి పడేశాడు.
శిశిరగారూ
ఏమి చేస్తామండీ,ఆ వీడియో చూసి త్రుప్తి పడాలేమో
పెళ్ళన్నాకనపడిందా మీకు
థాంక్యూ
హ్మ్! లతగారు చాలాబాగా వ్రాసారు. నిజమే! ఈమధ్య పెళ్ళిళ్ళు చూస్తుంటే చిరాకేస్తోంది.అసలు అల్లు అర్జున్ పెళ్ళి ఫొటోలు చూస్తుంటే ఇంటరెస్టే లేదు నాకు!! ఏవిటండీ తాళి కట్టేటప్పుడు అన్ని ఎక్స్ప్రెషన్స్! బాబోయ్! మరీ ఇంత సీన్ చెయ్యాల్లా అనిపించింది!! మీరు మాత్రం నిజ్జంగా చాలా బాగా వ్రాసారు :)
థాంక్స్ ఇందూ
అవును అలాగే అనిపించింది,
బాగా చెప్పారు.నువ్వు లేవు కదే మా వాడి పెళ్ళికి అంటూ మా అత్త కొడుకు పెళ్ళీ photo లు చూపించింది ఈ మధ్య india వెళ్ళినప్పుడు. మొత్తం ఫొటోలన్నీ...పెళ్ళి కొడుకూ, పెళ్ళి కూతురూ రకరకాల పోసుల్లో. సందడిగా, హడావిడి గా తిరిగే చుట్టాలే లేరు ఎక్కడా... ఎవ్వర్నీ రానివ్వకుండా మటపం అంతా photographers తోటే నింపేసినట్టున్నారనిపించింది.ఏదో portfolio చూసినట్టనిపించింది ఆ photoలు చూస్తే. వధూవరులకి ఎంతో ముఖ్యమైన రోజే ఐనా అందరూ సందడిగా తిరుగుతూ హడావిడి చేస్తేనే కదా పెళ్ళంటే...వచ్చిన వాళ్ళంతా తిని అలా దూరం గా కూచుని చూసి వెళ్ళండీ అంటే ఎంత ఖర్చు పెట్టి చేసినా, ఏమి తృప్రి వుంటుందిలే అనిపించింది ఆ album చూసాకా ...
లత గారు ,
ఫొటో గ్రాఫెర్లూ , విడియోగ్రాఫర్లూ , వాళ్ళకు ఫోజులిచ్చే వధూ వరులు తప్ప పెళ్ళి సందడే లేకుండా పోయిందీమద్య . తాళి గడుతూ , తలంబ్రాలు పోసుకుంటూ ఒకటేమిటి అన్నింటికీ వధూ వరులు ఫోటోగ్రాఫర్ నూ , విడియో గ్రాఫర్నూ చూస్తూ చేయటమే ! ఈ మద్య ఓ పెళ్ళి లో పాటల ప్రోగ్రాం లో ' నిగమ నిగమాగమా నారాయణా ' అని పాడుతుంటే ఇహ వూరుకోలేక , ఆ పాడే అమ్మాయికి , అమ్మా అది చనిపోతూ హీరోయిన్లు పాడిన పాట , పాట బాగున్నా సినిమాలో తీసిన సంధర్భం అది , పెళ్ళి లో ఆ పాటేమిటమ్మా అని చెప్పి , మళ్ళీ ఆ అమ్మాయి నన్ను తిట్టేలోపు వచ్చేసా !
బాగా రాసారు .
అవును స్ఫురిత గారూ నిజమే
అవును మాల గారూ శుభమా అని పెళ్ళి చేసుకుంటుంటే ఈ పాటలేమిటో
గాలివానలో పాట విని మా వాళ్ళు కూడా అ పరుగులు పెట్టారు ఆపడానికి
థాంక్యూ
Post a Comment