మధువొలకబోసే
పాత పాటల్లో నాకు చాలా నచ్చే పాటల్లో ఇదొకటి. కన్నవారికలలు సినిమా
లోది ఈ పాట.ఎంత అందంగా మొదలవుతుందో ఈ పాట. హిందీలో తీసిన
ఆరాధనకు ఈ సినిమా రీమేక్ అనుకుంటా. కానీ శోభన్,వాణిశ్రీల జంట
చాలా బావుంటారు.
ఆపిల్ చెట్లూ,కాయలూ వీటి మధ్య చిత్రీకరణ కూడా బావుంటుంది.
మనసు మనసుతో ఊసులాడనీ
మూగ భాషతో బాస చేయనీ
ఈనాటి హాయీ వేయేళ్ళు సాగాలనీ
సుశీల,రామకృష్ణ స్వరాలలో వింటున్నంత సేపూ హాయిగా ఉంటుంది.
మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు "మధువొలక"
అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ
అనుమతినే కోరకనే నిండేవు హృదయమూ
తలవకనే కలిగినచో అది ప్రేమ బంధమూ
బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ
మనసు మనసుతో ఊసులాడనీ
మూగ భాషలో బాస చేయనీ
ఈనాటి హాయి వేయేళ్ళు సాగాలనీ "మధువొలక"
గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ
తలపులకు వలపులకు సరిహద్దు లేదనీ
కుసుమముతో ఆ భ్రమరం తెలిపింది ఏమనీ
జగములకు మన చెలిమి ఆదర్శమౌననీ
కలలుతీరగా కలిసిపొమ్మనీ
కౌగిలింతలో కరిగిపొమ్మనీ
ఈనాటి హాయీ వేయేళ్ళు సాగాలనీ "మధువొలక"
Post a Comment
20 comments:
:) నేనూ మీ పార్టీ యే.. ఈ పాట నా ఫేవరేట్ పాట..
నా అదృష్టం చెప్పనా? 1999 లో సాన్ హోసే లో ఒకసారి సుశీల,రామకృష్ణ గార్లు లైవ్ పాడగా విన్నాను.. జనాలు కూడా.. పెద్దగా లేరు ఆరోజు.. హాల్లో 50-100 మందే ఉన్నారు. చాలా లక్కీ కదా నేను?
manchi paatha patani gurthuchesaru. thanks.
నిజంగా చాలా లక్కీ క్రిష్ణప్రియా మీరు.జీవితంలో ఒక్కసారన్నా అలా లైవ్ షో కి వెళ్ళి ఇలాంటి పాటలు ఆస్వాదించాలని ఓ చిన్న కోరిక ఉండేది నాకు కూడా.
ప్చ్ అసలు తీరలేదు
అవును గీతగారూ,చాలా మంచి పాట
ఎప్పటినుండో వెదుకుతుంటే వీడియో నిన్న దొరికింది .
ఈ పాట నాకూ చాలా చాలా ఇష్టం! రామకృష్ణ చక్కగా పాడిన కొన్ని పాటల్లో ఇదొకటి!
"ఈనాటి హాయీ....." అన్న చోట గమకం చాలా స్వీట్ గా ఉంటుంది
ఇలాంటి పాటలు నేను చూడకుండా...కేవలం విని ఆ మాధుర్యాన్ని ఎప్పటికీ దాచుకుంటాను. కొన్ని పాటలు చూస్తే ఇహ మళ్ళీ వినబుద్ధి కాదు
@ సుజాత,
నిజమే.. అందుకే నేను వీడియో లింక్ చూసినా క్లిక్ చేయలేదు.. లిరిక్స్ చూసి మాత్రం మరోసారి పాడుకున్నాను.
e paata naku nachutundi soft gaa vuntundi thank u latha garu
అబ్బ...ఎంత మంచిపాటో....ఈ పాట పదే పదే వినాలనిపించే నా ఫేవరెట్ డ్యూయెట్స్ లో ఒకటి...ముఖ్యంగా రామకృష్ణ సుశీల డ్యూయెట్స్ లో..
మంచిపాటని మళ్లీ గుర్తుచేసారు.
కానీ వీడియోకూడా నాకు ఇష్టమే..ఈ సినిమా వరకు..ఎందుకంటే శోభన్, వాణిశ్రీ అభిమాన జంట కదా నాకు..అందుకు.
థాంక్యూ..
ఈ పాట విన్నప్పుడల్లా అనిపిస్తుంది సుశీలమ్మ ఉండటం వల్ల మనకు లతాజీ అవసరం రాలేదు అని.నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి.ముఖ్యంగా నేపథ్యంలో వచ్చే సంగీతం వేరే లోకాలకు తీసుకువెళ్తుంది .ఆద్భుతమైన సంగీతం అంతకు మించిన గానం .
Thank you very much for reminding this song
ఈసినిమాకు సంగీతం వి.కుమార్,అంటే విజయ కుమార్,అంటే జి.విజయ కుమార్,అంటే ఘంటసాల విజయ కుమార్,అంటే ఘంటసాల గారి పెద్దబ్బాయి.అకాల మరణం పాలయ్యాడు పాపం!
అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ
అనుమతినే కోరకనే నిండేవు హృదయమూ
తలవకనే కలిగినచో అది ప్రేమ బంధమూ
బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ
(ఈ లైన్లు చాలా నచ్చుతాయి నాకు)
మంచిపాటని మళ్లీ గుర్తుచేసారు.thanks
నాకు బాగా యిష్టమైన పాట .
వీళ్ళిద్దరూ కలిసి పాడిన యింకో మంచి పాట
యిక్కడే కలుసు కున్నాము
ఎప్పుడో కలుసు కుంటాము
ఏ జన్మ లోనో ఎన్నెన్ని జన్మలలోనో
రాజేంద్ర కుమార్ గారూ, వి కుమార్ అంటే ఘంటసాల
విజయకుమార్ కాదండీ! తమిళ సంగీత దర్శకుడు. ఆయన గురించి, మధువొలకబోసే పాట గురించీ వేణువు బ్లాగులో ఒక పెద్ద టపాయే ఉంది.
రవి గారూ, ఆ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు....పాట కూడా బాగుంటుంది
టపా లింకు ఇవ్వడం మరిచాను.
http://venuvu.blogspot.com/2009/08/blog-post.html
సుజాతగారు ఈ పాట చూడడానికి కూడా బాగానే ఉంటుందండి
కానీ నిజం, కొన్ని పాటలు ఎంత ఘోరంగా తీస్తారో,అలా నేను చాలా నిరాశపడ్డ పాట కొత్తజీవితాలు లోని తంతన తంతన తాళంలో అనే పాట ఎందుకు చూశానా అని ఇప్పటికీ బాధవేస్తుంది.
మంజు గారు,సుధగారు,శశి గారు
అవునండి ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
పద్మగారు,రవి గారు
అవునండి మంచి పాట
సుజాతగారు,అవునండి ఒకనాటి మాట కాదు పాట కూడా బావుంటుంది
మీరు ఇచ్చిన లింక్ చూస్తాను
అందరికీ ధన్యవాదాలు అండీ
లతా, మీకు నూరేళ్ళు! ఆ కొత్త జీవితాలు పాటైతే టీవీలో చూశాక నాకు మతి పోయింది.అప్పటివరకూ ఎంతో మధురంగా వినిపించే ఆ పాట తర్వాత ఎప్పుడు తల్చుకున్నా ఆ దృశ్యాలే గుర్తొచ్చి విరక్తి పుట్టింది
అవును సుజాత గారూ నిజమే
సినిమా చూడలేదు అని,ఆ పాట చూడాలని యూట్యూబ్ లో వెతికి మరీ చూశాను,ఇక నా పరిస్థితి ఊహించుకోండి
లత గారూ మంచి పాట. రామకృష్ణ గారి గొంతులో ఒక గమ్మత్తైన మత్తు వినిపిస్తుంటుంది ఈ పాటలో...మంచి పాటని గుర్తు చేసారు.
అవును సౌమ్యగారూ
Post a Comment