Friday, March 18, 2011

అరటిపళ్ళే ,కానీ


అరటిపళ్ళు ఫోటోచూసి ఆశ్చర్యం వేస్తోంది కదూ.ఎంత పసుపు పచ్చగా, 

పండుగా ఉన్నాయో చూడండి.అందుకే ఫోటో తీసాను.వీటిని వలిచి తినబోతే 

లోపల కాయ రాడ్ లాగా గట్టిగా ఉన్నాయి.ఒకటి కాదు రెండు కాదు నాలుగు 

కాయలు ట్రై చేసాను  నిన్న సాయంత్రం పాపకి ఇవ్వడానికి.ఊహూ అంత 

గట్టిగా ఉన్నవాటిని పెట్టడానికి ప్రాణం ఒప్పక, బిస్కట్స్ ఇచ్చాను చివరికి.ఈ 

రోజు ఉదయం కూడా అలాగే ఉన్నాయి.

ఈ మధ్య స్ప్రేచల్లి  కలర్ తెప్పించేస్తున్నారు అని వింటున్నాము కానీ

ఇంతవరకూ ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు.మొదటిసారి ఇలా జరగడం.

మళ్లీ ధర చూస్తే ముప్ఫై రూపాయలు.యాపిల్స్ అంటే వాక్స్ అంటున్నారు 

డబ్బు,కాయలు వేస్ట్ అయ్యాయి అని కాదు కానీ ప్రక్రుతి సహజమైన పళ్ళని 

 కూడా ఇలా చేసేసి మనని మోసం చేసేస్తున్నారని బాధ.

ప్చ్

Post a Comment

9 comments:

Sravya V

అరటి పళ్ళు కలర్ ఇలా ఉన్న , గట్టి గా ఉన్నాయా :(

ఆపిల్ wax కోటింగ్ ఉన్నా భయపక్కర్లేదండి , కాపోతే తినే ముందు వేడి నీళ్ళ తో తో కడిగితే చాలు !

veera murthy (satya)

నిజమే పసిపిల్లలకి అలాంటివి తినిపించాలంటే భయమౌతుంది.

ethylene ,ethephon (2-chloroethylphosphonic acid), లాంటి హర్మోన్ లని త్వరగా పక్వని రావడానికి , రంగు మారడానికి, వాడతారు.

ఈ పాశ్చాత్య నాగరికత నే అంత...
మొదట chemicals వాడమని ప్రోత్సహించేదీ వీళ్ళే,
ఆ తరువాత corbonic fruits మాత్రమే తినాలి మాట్లాడతారు....
వాటి ధరలుమామూలు పండ్లకన్నా మూడింటలు ఎక్కువగా వుంటాయి. అందరికీ అందుబాటులోకి కావాలనే తీసుకురారు.

చెప్పాలంటే......

photo chuda gaane tinaalanipinstondi lata gaaru....

లత

అవును శ్రావ్య గారూ,చాలా గట్టిగా ఉన్నాయి
నిజమే సత్య గారూ
అవును మంజూగారూ చూడగానే అలాగే అనిపించింది

సుమలత

@లత గారు
ఇప్పుడున్న కాలంలో ఎది బయట కొనాలన్న బయం వేస్తుంది ప్రతి దాంట్లో
కల్తి చేస్తున్నారు.జాగ్రత్త అండి పిల్లలకి పెట్టేటప్పుడు ...

జయ

ఈ హైబ్రిడ్ పంటలతో వచ్చిన ప్రమాదమే నండి ఇది. జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

లత

సుమలతగారు, అదే కదా
అవును జయగారు, తప్పదు
థాంక్యూ

Ennela

పాల గురించి కూడా ఒక ఆర్టికల్ చదివాను యీ మధ్య...పిల్లలని ఎక్కువ పాలు తాగమని చెపుదామనుకుని మళ్ళీ విరమించుకుంటున్నా..ఆ ఆర్టికల్ చదివాక!.

లత

ఎన్నెల గారూ నిజమా
ప్చ్,పాలూ,పళ్ళూ కూడా ఇలా అయిపొతే ఎలాగో మరి

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008