Wednesday, March 2, 2011

రుద్రాభిషేకం


మా ఊరిలో చాలా  గుళ్ళు ఉన్నా అన్నింటిలోకి పెద్దది మాత్రం శివాలయమే.

చాలా విశాలంగా చుట్టూ ఎత్తైన గోడలు,లోపల అంతా చెట్లు,పూల మొక్కలతో 

చాలా  అందంగా ఉంటుంది.అక్కడికి వెళ్తే ఒక పట్టాన రావాలని అనిపించేది 

కాదు.ప్రతి పుట్టిన రోజు నాడు కొత్తబట్టలు  కట్టుకుని ఆ గుడికి వెళ్ళేదాన్ని.

అందులోనూ  నవంబర్ లోనేమో సామాన్యంగా  కార్తీకమాసం 

కలిసొచ్చేది.మంచిదని అభిషేకం కూడా చేయించుకునే వాళ్ళం.


ఇక అభిషేకం సంగతి కొస్తే ఒకే ఒక్కసారి శివరాత్రి నాడు మహారుద్రాభిషేకం 

చూశాను.ఇక్కడే బేగంపేట లో ఫ్లై ఓవర్ ఎక్కే ముందు ఎడమవేపున 

ఉంటుంది ఆ శివాలయం.అప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం.రాత్రి 

పన్నెండు గంటలకి రుద్రాభిషేకం బావుంటుంది అంటే చేయించాము.నిజంగా 

చూసి తీరాల్సిందే.దాదాపు రెండుగంటలు జరిగింది.ఎవరో చెప్పారు 

కొబ్బరిబొండాల నీటితో అభిషేకం  చేయిస్తే చాలా మంచిది అని.అందుకని 

అన్నిటితోపాటు పెద్దపెద్ద బొండాలు తీసుకువెళ్ళాము.గర్భగుడి ముందు 

మమ్మల్ని కూర్చోబెట్టి వరుసగా అన్నింటితో అభిషేకం చేసి,అయ్యాక 

స్వామిని అలంకరించి,అప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చారు.

అంత సేపూ మంత్రాలతో పాటు ఓంనమశ్శివాయ అంటూ శివనామస్మరణ. 

ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజాము మూడుగంటలు అయినా,ఆ రోజు మాత్రం 

మనసుకు  చాలా తృప్తిగా అనిపించింది

Post a Comment

4 comments:

Sravya V

ఈ గుడి నాకు తెలుసు :)

లత

అవునా,బావుంటుంది కదండీ గుడి

Sravya V

అవునండీ చాల బావుంటుంది . ఒక మూడేళ్ళ కిత్రం వరకు నెలకు ఒక్కసారన్న ఈ గుడికి వస్తుండేదాన్ని :)

లత

ఓకె శ్రావ్య గారూ

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008