Monday, March 14, 2011

ఆకు - జీవితం, ఆకు


చిగురించే ప్రతి ఆకూ 
మనసును ఉరకలు వేయిస్తుంది 
కొత్తచివుళ్ళతో జీవించమంటుంది 


ఎదిగే ప్రతి ఆకూ 
ఒదిగి ఉండమంటుంది
అనుభూతుల మంచుముత్యాలను
ఒడిసి పట్టుకోమంటుంది


పండిపోయిన  ప్రతి ఆకూ 
వార్ధక్యాన్ని తలపిస్తుంది 
అనుభవాల జ్ఞాపకాలను 
నెమరువేసుకోమంటుంది 


రాలిపోయే ప్రతిఆకూ 
రేపు నీ గమ్యం ఇదేనంటూ 
జీవితసత్యాన్ని నేర్పుతుంది 


ఆకు 


చిరు మొలకవై 
పుడమిని చీల్చుకొస్తావు

చిగురాకు ఊయలవై 
చిలకమ్మకు జోల పాటవుతావు

లేలేత మావిచిగురువై 
కోయిలమ్మకు రాగం నేర్పుతావు 

తొలి ఉషస్సున దోసిలివై 
తుషార బిందువులను లాలిస్తావు 

చిరుగాలికి తల ఊపుతూ 
పూబాలలను  ప్రేమిస్తావు

మండే ఎండకు అల్లాడితే
నీడవై సేదతీరుస్తావు  

హరిత వర్ణంతో  ప్రాణ వాయువై 
లోకానికి శ్వాసవవుతావు

నువ్వు లేకపోతే 
పచ్చని పుడమి లేదు 
బంగారు భవిత లేదు


Post a Comment

9 comments:

Anonymous

రెండో కవిత కంటే మొదటి కవిత బాగుంది

చెప్పాలంటే......

నాకు మొదటి కవిత చాలా నచ్చింది....రెండోది కుడా బావుంది

లత

అను గారు, మంజు గారు
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండీ
థాంక్యూ

రాధిక(నాని )

బాగున్నాయండి.

లత

థాంక్యూ రాధికా

బాలు మంత్రిప్రగడ

ఆకు-జీవితం కవిత నాకు బాగా నచ్చింది
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

లత

థాంక్స్ బాలు గారూ

Unknown

చిగురాకు ఊయలవై
చిలకమ్మకు జోల పాటవుతావు

లేలేత మావిచిగురువై
కోయిలమ్మకు రాగం నేర్పుతావు

తొలి ఉషస్సున దోసిలివై
తుషార బిందువులను లాలిస్తావు

చిరుగాలికి తల ఊపుతూ
పూబాలలను ప్రేమిస్తావు

adbhutam latha garu

లత

థాంక్యూ శైలగారు
మీకు అంత నచ్చినందుకు చాలా ఆనందం కలిగింది.

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008