Thursday, November 11, 2010

కార్తీకపౌర్ణమి

కార్తీక పౌర్ణమి  అనగానే మనసు చిన్నతనం లోకి పరుగులు తీస్తుంది .వెన్నెల లాంటి జ్ఞాపకం అలలా పలకరిస్తుంది .
ఎందుకో తెలియదు కార్తీకపౌర్ణమి అంటే చాల ఇష్టం నాకు.చిన్నప్పుడు ఉపవాసం ఉండడం కూడా సరదాగా ఉండేది.పగలంతా కష్టపడి (ఏమి తినకుండా ఉండడానికి) ఉపవాసం ఉండి 5 గంటలకే శివాలయానికి వెళ్లి ముగ్గు వేసి ,అందులో బాదం ఆకులమీద ప్రమిదలు పెట్టి 365 వత్తులు కట్టగా కట్టి నానబెట్టినవి వెలిగించి ఇంటికి వచ్చేవాళ్ళం. 
ఒక అప్పటినుండి చంద్రుడు కోసం ఎదురు చూపులు అన్నమాట.మరి ఆయన వస్తేనే కదా భోజనం.


పున్నమిచంద్రుడు 
మాకు పెద్ద ఓపెన్ వరండా ఉండేది .పుచ్చపువ్వు లాంటి వెన్నెల్లో పీట వేసి దేవుణ్ణి పెట్టి పూజ చేసి తరువాత అక్కడే భోజనం చేసేవాళ్ళం.
చిట్టి గారెలు,పులిహోర,నేతిబీరకాయ పచ్చడి,పాయసం తప్పనిసరిగా  ఉండేవి.అసలే ఆకలి దంచేసేదేమో హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే అమృతంలా ఉండేది.
ఈ తరం పిల్లలకి ఆ ఆవకాశం లేదేమో .ఈ అపార్ట్మెంట్ జీవితాల్లో చంద్రుడు కనపడడమే గొప్ప .ఇంకా వెన్నెల్లో భోజనం కూడానా ,ప్చ్ .

Post a Comment

6 comments:

చెప్పాలంటే......

బావున్నాయి కార్తీక పున్నమి కబుర్లు.నేను రాద్దామనుకుంటే మీరు చెప్పేశారు అంతా. బాగా రాసారు.

swapna@kalalaprapancham

memu oka sari "vennello bhojanalu" ani pettukunnam pandu vennala nadu andaramu intiki oka item choppuna chesukoni terrors mida bhojanalu pettukunnamu. games kuda adukunnamu saradaga. apartment lo undevallu ila cheyochhu :)

లత

మంజు గారూ థాంక్యూ.

లత

స్వప్న గారూ,అందరికీ ఇంట్రస్ట్ ఉండి అంతా కలవాలి కద

శిశిర

అదంతా గత వైభవమేనండి ఇప్పుడు. మంచి జ్ఞాపకాలు గుర్తుచేశారు.

లత

అవును శిశిర గారూ,థాంక్యూ

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008