Wednesday, November 17, 2010

సరోజ దళనేత్రి -- కే.ఎం .రాధాకృష్ణన్

ఈ మధ్య వచ్చిన కొత్త పాటల్లో  కే.ఎం.రాధాకృష్ణన్ కంపోజిషన్స్ అన్నీ బావుంటాయి.ఒక ఆనంద్,గోదావరి,చందమామ  వీటి లోని పాటలు అన్నీ చాలా కాలం పాటు మారుమ్రోగిపోయాయి.అలాగే రాజా, భూమిక  నటించిన మాయాబజార్ సినిమా లోని ఈ రెండు పాటలు చాలా బావుంటాయి బాలు,చిత్ర  పాడిన' సరోజ దళనేత్రి',  హరిహరన్,శ్రేయ ఘోషల్ పాడిన 'ప్రేమే నేరమౌనా 'రెండూ  నాకు ఇష్టం.

"సరోజ దళనేత్రి " వీడియో 



సరోజ దళనేత్రి,ఇదో లాహిరి
జన్మకి నవరాత్రి ,ఇదో అల్లరి 
ప్రియతమ నిండు మమమమ , అన్న మధురిమే పెళ్లి మంత్రం
బిడియపు లేత సరసపు  ఈడు సమిధగా ప్రేమ యజ్ఞం   "సరోజ"

మంగళ వాద్యం మదిలో మ్రోగ,మల్లెల జడలో వెన్నెలలూగా,
తెరచాటులలో మరులే రేగ ,పొగ చాటులలో అగచాట్లేగా,
తలనే వంచి,తపనే పెంచి ,
కలలే పంచే కల్యాణంలో         "సరోజ"
మనసే కలిసే మాంగల్యాలు,మనసున మనసు మాధుర్యాలు ,
జతగా కలిపే  శతమానాలు,శృతి కలిపే ఈ అనురాగాలు ,
దివిలో తలచి ,భువిలో జరిగే ,
శ్రీవారింటి  పేరంటంలో        "సరోజ"


" ప్రేమే నేరమౌనా  పాట"  వీడియో  

Post a Comment

4 comments:

అక్షర మోహనం

అ0దమైన , మధురమైన అచ్చ తెలుగుపాటలు విన్నాను..మీకు కోటి నెనరులు.

సుజాత వేల్పూరి

రాధాకృష్ణన్ పాటలు మెలోడీ బేస్ లైన్ దాటకుండా, కొద్దిగా ఫ్యూజన్ టచ్ తో కొత్త కొత్తగా ఉంటాయి. మాయా బజార్ లోని ఈ రెండు పాటల్లోనూ నాకు "ప్రేమే నేరమౌనా" పాట బాగా నచ్చుతుంది. చరణాల్లో వచ్చే ఆలాపనలు, చరణం చివర వచ్చే లాండింగ్ నోట్స్,(ముక్తాయింపు) చాలా మధురంగా ఉంటాయి. రాధాకృష్ణన్ మూస సంగీత బాణీలను మాత్రం ఇప్పటివరకూ వాడటం లేదు. ముందు ముందు ఏం చేస్తాడో గానీ!

ఇంకో ప్లస్ పాయింట్ ఈ పాటలు శ్రేయ పాడటం! ఆ అమ్మాయి గొంతులో సాక్షాత్తూ సరస్వతి కొలువుందేమో అన్నంత మాధుర్యం కనపడుతుంది నాకు! ఏ పాటైనా అలవోగ్గా పాడటం, తెలుగును చక్కగా ఉచ్చరించండం శ్రేయకు చాలా తేలిక!

లత

అక్షరమోహనం గారూ, థాంక్స్ అండీ,
నాకూ ఇలాంటి పాటలు ప్రాణం.

లత

అవును సుజాత గారూ,ప్రేమే నేరమౌనా పాట చరణాలు చాలా బావుంటాయి.
రాధాక్రిష్ణన్ పాటల్లో క్లాసికల్ బేస్ కూడా ఉంటుంది. కానీ అంత బాగా అవకాశాలు వస్తున్నట్టు లేదు అతనికి .వస్తే మనకి ఇంకా కొన్ని మంచి పాటలు వినే భాగ్యం దొరుకుతుంది

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008