మా ఇంట్లో మైక్రోవేవ్
ప్రస్తుతం మైక్రోవేవ్ ఓవెన్ ప్రతి ఇంట్లోనూ ఉంటోంది కదా.మేము కొందాము అనుకున్నప్పుడు కూడా, మిగిలినవి వేడి చేసుకోవడానికే ఎక్కువ ఉపయోగం అంతే అన్నారు చాలా మంది .మా ఫ్రెండ్ కూడా నేనూ రీహీటింగ్ కాఫీ , పాలు కలపడానికి వాడతాను అంతే మా అక్క మాత్రం అప్పుడప్పుడు కూరగాయలు బాయిల్ చేస్తుంది అని చెప్పింది.దాంతో నిజంగానే చిన్న డౌట్ వచ్చింది.కాని ఎప్పటినుండో కొనాలని ఉంది కనుక ఆ రోజే బయల్దేరాము.
షాప్ లోకి వెళ్ళాక అన్ని బ్రాండ్స్ చూసి మళ్లీ డౌట్.మా బాబుని అడిగితే జనరల్ గా LG బాగానే ఉంటుంది తీసుకోండి అన్నాడు.సరే అన్నీ వదిలి samsung ,LG లలో ఆలోచిస్తుంటే పాపం అక్కడ డెమో ఇస్తున్న అతను నిజాయితీగా చెప్పాడు. రెండూ ఈక్వల్లీ గుడ్ అండీ కాకపోతే samsung లో లోపల బాడీ సిరామిక్ ఉంటుంది LG లో స్టీల్ ఉంటుంది కనుక ఇంకా త్వరగా అయిపోతాయి అని. సరే అని LG తీసుకున్నాము .అలా మైక్రోవేవ్ మా ఇంటికి వచ్చింది
వస్తూనే పాకింగ్ అంతా పీకేసి స్టార్టర్ కిట్ లోని గ్లాస్ లో నీళ్ళు తీసుకుని వేడిచేసేసి,ఓకే అనుకున్నాము.మా ఇంట్లో ఏ వస్తువైనా తేగానే ఆన్ చెయ్యడం అలవాటులెండి.
మర్నాడు షాప్ నుండీ వచ్చిన అతను ఏవో కాంబినేషన్లు చెపితే జాగ్రత్తగా రాసుకున్నాను.మొదటగా తియ్యగా బిస్కట్స్ చేద్దాం కదా అని రెడీ చేసి అతను చెప్పినట్టే పెట్టాను ,రెండో నిమిషం అవకముందే పొగ వచ్చి మాడటం మొదలెట్టాయి.సరే టెంపరేచర్ తగ్గిస్తే, సెకండ్ బాచ్ బాగానే వచ్చాయి అనుకోండి.ఇలా కాదులే అని కాల్ సెంటర్ కి కాల్ చేస్తే ,కంపెనీ అతను వచ్చి కొన్ని చెప్పాడు.ఫ్రీ క్లాసెస్ కి వెళ్ళండి మేడం అని సలహా కూడా ఇచ్చాడు.ఆల్ రెడీ మూడు ఫ్రీ క్లాసెస్ కి కూపన్లు ఉన్నాయ్ కదా వెళ్ళమని మా వారు .ఏమి వద్దులే బాబూ నేనే నేర్చుకుంటాను అని నెట్ లోచూసి కొంతా ,సొంతంగా చేస్తూ కొంతా, మొత్తానికి బాగానే నేర్చుకున్నాను.నేనైతే ఇప్పుడు రోజూ మాగ్జిమం వాడుతున్నాను.
మాది 21 Lts .హైలో 840 వాట్స్ వస్తుంది .ఇందులో నేను చేసే ఐటమ్స్ చెప్తాను.
1 . టమాటాలు.ఉల్లి మిర్చి ముక్కలు కలిపి 3 నిముషాలు హైలో పెడితే చక్కగా మగ్గిపోతాయి.తీసి తాలింపు వేసుకుని రసం పెట్టేసుకోవచ్చు.
2 . వేపుడు కూరలు చాలా త్వరగా అవుతాయి .ఉదా; దొండకాయ వేపుడు,ఆలుగడ్డ పచ్చి ముక్కల వేపుడు ,బెండకాయ వేపుడు లాంటివి.బెండకాయ కూర జిగురు కాని ,ముద్దగా అవడం కాని లేకుండా పొడిపొడిగా వస్తుంది.
3 . స్వీట్స్ కూడా ఇందులో తొందరగా అవుతాయి. 7 కప్స్ స్వీట్ .బర్ఫీలు. ఖీర్ లు,కేసరి ,హల్వాలు చేసుకోవచ్చు.బ్రెడ్ ఖీర్ కూడా .కొబ్బరి ఉండలు,కొబ్బరి బర్ఫీ చెయ్యవచ్చు.
4 .convection మోడ్ లో కేక్స్ ,బిస్కట్స్ , పుడ్డింగ్స్ అన్నీ చెయ్యొచ్చు.
5 .రోటి పచ్చళ్ళకు కూడా ఇందులో మగ్గిస్తే మాడుతాయి అన్న భయం ఉండదు.ఉదా;వంకాయ ముక్కలు,మిర్చి,టమాట కలిపి ఉడికించి పచ్చడి చేసుకోవచ్చు,
6 . చికెన్ కర్రీ కూడా బాగుంటుంది ముక్క చాలా మెత్తగా ఉడుకుతుంది. కానీ చికెన్ ముందు మారినేట్ చేస్తే బాగుంటుంది.
ఆలూ గోబీ,గోబీ మటర్ ఇలాంటి సైడ్ డిషెస్ కూడా చేసుకోవచ్చు.
7 బొంబాయి రవ్వ ,సేమియా కలిపి వేసే ఇడ్లీలకి మాత్రం 640 వాట్స్ లో 4
టూ 5 మినిట్స్ పడుతుంది .అలాగే రవ్వ,ఓట్స్ పౌడర్ కలిపి కూడా వెయ్యొచ్చు.
రైస్ ,పప్పు మాత్రం కుక్కర్ లోనే త్వరగా అవుతాయి కనుక ఎప్పుడూ ట్రై చెయ్యలేదు.పాన్ లో డైరెక్ట్ గా వండే కూరలు కూడా అనవసరం.ఉదా; సొరకాయ,ములక్కాయ లాంటివి.సో ఇవీ నా మైక్రోవేవ్ కబుర్లు
Post a Comment
4 comments:
లతా,
మీ మైక్రోవేవ్ కబుర్లు బాగున్నాయి.
థాంక్స్ మంజు గారూ
chaalla bagundhi andi..meeru udikinchetappudu paina muutha emanna pedthara..naaku eppudu ee doubt nenu muutha pettanu..pettaka pothe emanna poshakalu pothaya ani na sandeham..and tomato,mirchi,onion rasam kosam..water tho kalipi udikisthara..water add cheyyakapothe kastha antukoni poyinattuga avuthundhi kadha..
--srujana
థాంక్యూ స్రుజన గారూ,
టమాటాలు ఉడికించేటప్పుడు కొంచెం నీళ్ళు పోస్తాను.కానీ చాలా కొంచెం చాలు.ఎక్కువైతే చింది ప్లేట్ మీద పడతాయి.
నేనూ మూత పెట్టను పోషకాల గురించి ఎమైనా తెలిస్తే మళ్ళీ చెప్తాను.
Post a Comment