Sunday, November 21, 2010

బ్లాగ్ వనభోజనం లో మేతిచమన్,బ్రెడ్ బాసుంది

బ్లాగ్ వనభోజనాలు.

అందరికి ఆహ్వానం. వెరైటీగా బ్లాగ్స్ లో చేసుకుంటున్నాము కదా, అందుకే 

కొంచెం వెరైటీగా ఈ రెండు వంటలూ మీ కోసం.


                             మేథీచమన్




కావలసిన  పదార్ధాలు ;

మెంతికూర                 1 కప్ 
పాలకూర                   1 కప్ 
టమాటా ప్యూరీ             1 కప్   
పనీర్ తురుము            1 కప్
ఉల్లిపాయ                   1 మీడియం సైజ్  
పచ్చిమిర్చి                 4   
అల్లం,వెల్లుల్లి ముద్డ        2 టీస్పూనులు 
ఉప్పు,కారం                 తగినంత 
పసుపు                     అర స్పూను
కసూరిమేతి                 2 టీస్పూన్స్ 
గరంమసాలపొడి           1 టీస్పూన్ 
కాజూ                       1/2 కప్
క్రీం                          1/2  కప్
కొత్తిమీర                    కొంచెం.
నూనె                       4 టేబుల్ స్పూన్స్ 


తయారు చేసే విధానం; 

ఒక టేబుల్ స్పూన్ నూనె లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, మిర్చి కాజు వేయించి ముద్దగా నూరుకోవాలి.
మిగిలిన నూనె వేడిచేసి ఈ ముద్దను వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్దవేసి వేయించాలి.
టమాటా ప్యూరీ వేసి నూనె తేలేవరకూ ఉంచి  పసుపు,తగినంత కారం వేసి ఒక నిమిషం వేయించాలి. 
సన్నగా తరిగిన మెంతికూర, పాలకూర వేసి బాగా మగ్గిన తరువాత పనీర్ తురుము వేసి   ఉడికించాలి
చివరగా గరం మసాల పొడి, క్రీం, తగినంత  ఉప్పు, కలిపి అరకప్పు నీరు పోసి బాగా ఉడికించి కసూరిమేతి పొడి, కొత్తిమీర చల్లి ఒక నిమిషం  ఉంచి దింపెయ్యాలి.
కొంచెం తురిమిన పనీర్, క్రీం తో అలంకరించుకుంటే  మేతిచమన్ రెడీ .    

           
నిన్న స్పెషల్ గా మీకోసం చేసి మరీ  ఈ స్వీట్ ఫోటో తీసి పెట్టానండి.అందరూ వచ్చి నోరు తీపి చేసుకోవాలి మరి.

                                                             

బ్రెడ్ బాసుంది 




                                               

కావలసిన  పదార్ధాలు:

బ్రెడ్                       4 స్లైసెస్ 
పాలు                     1/2  లీటర్ 
పంచదార                 1 కప్  
యాలకుల  పొడి         1 టీస్పూన్ 
కాజూ బాదం              2 టీస్పూన్స్ 
నెయ్యి                    3 టేబుల్ స్పూన్స్ 
ఇన్ స్టెంట్ బాదం మిక్స్ పౌడర్   1 స్పూన్ 
టుటి ఫ్రుటిలు ,చెర్రిస్   అలంకరణకి 

తయారు చేసే విధానం:
 బ్రెడ్ స్లైసెస్ ని మిక్సీ లో ఒకటి రండు సార్లు జస్ట్ తిప్పి వదిలేస్తే క్రంబ్స్ లా అవుతుంది.
 రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొంచెం పెద్ద గాజు బౌల్ లో తీసుకుని ఈ బ్రెడ్ క్రంబ్స్ వేసి  మైక్రోవేవ్ లో 1 మినిట్  హై లో పెట్టాలి.
ఒకసారి బాగా  కలిపి టెంపరేచర్ తగ్గించి ఇంకో నిమిషం పెట్టాలి  బ్రెడ్  క్రిస్పీగా  లైట్ బ్రౌన్ గా  ఫ్రై అవుతుంది  
తరువాత కాచిన పాలు కలిపి 2 మినిట్స్  హై లో ఉంచాలి. తీసి మళ్లీ కలిపి పంచదార,యాలకుల పొడి  కలిపి,మళ్లీ 2 మినిట్స్ హై లో ఉంచాలి. 
తీసి నేతిలో వేయించిన కాజూ బాదం మిగిలిన ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక నిమిషంహై లో ఉంచి తియ్యాలి.
ఇన్ స్టెంట్ బాదం మిక్స్ పోదో ఆప్షనల్  అండీ  వేస్తే కొంచెం కలర్ ,ఫ్లేవర్  బావుంటుంది.
కాసేపు ఫ్రిజ్ లో ఉంచి, టుటి ఫ్రుటిలు,చెర్రిస్ తో గార్నిష్ చేసుకుని  సర్వ్ చేస్తే తిన్నవారు ఆహా  ఏమి రుచి అనక మానరు.
 ఫ్రిజ్ లో ఉంచినప్పుడు కొంచెం చిక్కగా అయ్యింది అనుకుంటే ఒక కప్పు చిక్కని పాలు కలిపి సర్వ్ చెయ్యొచ్చు. 

అందరూ రుచి చూసి (చదివి) ఎలా  ఉన్నది చెప్పాలి మరి.   
                              

Post a Comment

15 comments:

sunita

chaalaa baagunnaayanDi.

లత

థాంక్స్ సునీత గారూ

మధురవాణి

మైక్రోవేవ్ తో ఇన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చని ఇప్పుడే తెలిసిందండీ! బ్రెడ్ బాసుంది ఎప్పుడో ట్రై చేసేస్తాను. :)

రాధిక(నాని )

చాలా బాగున్నాయండి.నేను ట్రై చేస్తాను.

లత

థాంక్యూ మధురవాణి గారూ,
ట్రై చెయ్యండి,తప్పకుండా నచ్చుతుంది.

లత

అలాగే రాధిక గారూ ,థాంక్యూ

మాలా కుమార్

అలాగే తీపి తప్పకుండా తింటాను , చూస్తేనే నోరూరిపోతోంది .

వేణూశ్రీకాంత్

Looks good :)

లత

థాంక్యూ మాల గారూ


థాంక్యూ వేణు గారూ

చెప్పాలంటే......

చాలా బాగుంది. naku bhale istam

లత

థాంక్స్ మంజు గారూ

Ram Krish Reddy Kotla

Sooperoo sooperu :-) nooru oorinchi vadileyyadam bhavyama :-(

లత

ఇవి బ్లాగ్ వనభోజనాలు కదండీ. తప్పదు మరి
నచ్చినందుకు థాంక్యూ రామక్రిష్ణ గారూ

Sree

nenu try chestaa chichkoo gaadiki.. thanks for the recipe with bread.

లత

thank you sree

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008