అమ్మ
చిన్న పల్లెటూరిలో పుట్టి,రోజూ రెండు మైళ్ళు నడిచి స్కూల్ కి వెళ్లి ఎస్.ఎల్.సి పాసైన అమ్మ
పదిహేనేళ్ళకే పెళ్ళిచేసుకుని పెద్ద కుటుంబంలోకి కోడలిగా వెళ్లి ,ఎన్నోశుభకార్యాలు తన ఇంట్లో జరిపించిన అమ్మ (పెళ్లిచూపులు,నిశ్చితార్ధాలు,పెళ్ళిళ్ళు ఇలా ఎన్నో )
ఏ వేళ ఇంటికి ఎవరొచ్చినా వండి వడ్డించి అన్నపూర్ణలా ఆదరించిన అమ్మ
ఒక్కగానొక్క కూతుర్ని కావడంతో ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని పెంచిన అమ్మ,
కాలేజ్ కి వెళ్ళే రోజుల్లో కూడా చదువుకుంటుంటే అన్నం కలిపి ముద్దలు తినిపించిన అమ్మ
నా పిల్లలకి ఆరోగ్యం బావుండకపోతే ఏళ్ళ తరబడి గురువారాలు మొత్తం ఉపవాసాలు చేసిన అమ్మ
ఈ రూపాయి ఉంటే పిల్లలకి ఉంటుంది అనుకుంటుందే తప్ప,ఈనాటికీ నాకిది కావాలి అని ఏమీ కొనుక్కోని అమ్మ
ఆరోగ్యం సహకరించకపోయినా ఇప్పటికీ ఏదో ఒకటి వండి పంపిస్తూనే ఉండే అమ్మ,
హ్మ్,అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే,ఏమి చెప్పినా తక్కువే.
ఈ రోజు తన పుట్టిన రోజు.అరవై వసంతాలు పూర్తిచేసుకుని అరవై ఒకటో ఏట అడుగుపెడుతూ సీనియర్ సిటిజెన్ అవుతున్న అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు
హాపీ హాపీ బర్త్ డే అమ్మా
మనసుకు రెక్కలున్నట్టు మనిషికి కూడా రెక్కలుంటే ఎంత బావుంటుందో.రివ్వున ఎగిరి అమ్మ దగ్గర వాలిపోవచ్చు .
Post a Comment
6 comments:
మీ అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు . ( నా కంటే నాలుగు రోజులు చిన్న అన్న మాట మీ అమ్మగారు :))
లత గారు, ఆ దేవుడు తనకు మారుగా అమ్మని సృష్టించింది అందుకే. కలకాలం ఆనందంగా మీ అందరితోటి తృప్తిగా మీ అమ్మగారు జీవించాలి. నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, నమస్సులు అందచేయండి.
Thalli manasuku paadhaabhi vandhanam. amma gaarki.. janmadhina subhaakaankshalu..andhinchaandi...plz..
అమ్మ గురించి బాగా రాసారు.
అవును మాలగారు,అమ్మ మీకంటే నాలుగు రోజులు చిన్నది,థాంక్యూ
థాంక్యూవెరీమచ్ జయ గారు
వనజగారూ, శిశిరా థాంక్యూ
మీ అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు .
మనసుకు రెక్కలున్నట్టు మనిషికి కూడా రెక్కలుంటే ఎంత బావుంటుందో.రివ్వున ఎగిరి అమ్మ దగ్గర వాలిపోవచ్చు .
ఆడపిల్లలికి అందున పెళ్లి అయిన ఆడపిల్లలికి తప్పకుండా రెక్కలు ఉండాలండి. మనం దీనిగురించి దేవుడికి అర్జి పెట్టుకోవాలి కూడా
Post a Comment