Monday, July 11, 2011

పేలాల పండుగ



 ఈ రోజు  తొలి ఏకాదశి. ఈ పండగగా కంటే పేలాల పండగగానే అందరికీ గుర్తు ఏమో.ఎందుకంటే ఈ రోజు తప్పకుండా పేలాలపిండి తినిపించేవారు చిన్నప్పుడు.
బహుశా దీనితోనే మనకు పండగలు మొదలవుతాయి అనుకుంటా.

తప్పనిసరిగా ఈనాటికీ  ఇల్లు దులుపుకుని,కడుగుకుని,ఈ రోజు తలంటుకుని పూజ చేస్తారు.చాలా సంవత్సరాల తరువాత ఇవ్వాళ్ళ నేను పేలాల పిండి చేశాను.ఇంట్లో మొక్కజొన్నలు ఉండడంతో వాటిని పాప్ కార్న్ చేసి,బెల్లం కలిపి గ్రైండ్ చేస్తే పిండి రెడీ అయ్యింది.ఇన్నేళ్ళ తరువాత ఆ టేస్ట్ ఎంత  నచ్చుతుందో చూడాలి.అసలు ఇప్పటి తరం వాళ్లకి ఇది తెలియదేమో కూడా.

ఇది చేస్తుంటే ఒక సంగతి గుర్తొచ్చింది,చాలా చిన్నపుడు ఇది తింటుంటే చింది ఒళ్ళంతా పడేది.ఎందుకలా జరిగేదో నా చిన్నిబుర్రకి అసలు అర్ధం అయ్యేది కాదు.ఆలోచించగా, చించగా తెలిసింది ఏమిటంటే శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరి వదులుతాము కదా.స్పూన్ నోటి దగ్గరకు వచ్చినప్పుడే నేను ఊపిరి వదిలేసరికి ఆ పొడి చింది పడేది అన్నమాట.ఒకసారి అది అర్ధం అయ్యాక నీట్ గా తినేదాన్ని అనుకోండి.అది వేరే సంగతి.కాకపోతే ఈ పేలాపిండి ఈ రోజే ఎందుకు తినాలో మాత్రం నాకూ తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

Post a Comment

13 comments:

యశోదకృష్ణ

identi naa gyapakalanni meeru raasaru. nenoppukonu, enoppukonu. ee doubt naaku vundi. please evarikaina telisthe cheppandi.

Unknown

లత గారూ.. తొలి ఏకాదశి అని తెలుసు కానీ మేమెప్పుడూ పేలపిండి తినలేదు. అందుకని నాకు తెలీదు.. మీరు బాగా రాసారు.. మీ పిండి రుచి బావుందా?

swapna@kalalaprapancham

pelala pindi tinedi gurthu unnadi naku kuda. bale idea icharu. ipudu asalu evaru chesukodam ledanukunta.

లత

గీత గారు ఇద్దరివీ ఒకే జ్ఞాపకాలు అన్నమాట.

ప్రసీద గారు రుచి చాలా బావుందండి.మావారైతే ఎన్నేళ్ళయ్యిందో అద్భుతంగా ఉంది అని ఆస్వాదించారు

స్వప్నగారు అవునండి ఎవరూ చెయ్యడంలేదు.నేను చేసి కూడా చాలా ఏళ్ళు అయ్యింది అందుకే ఈ సారి చేశాను
అందరికీ ధన్యవాదాలు.

ఇందు

లతగారూ...మా అమ్మ...ఈ రోజున ఎలాగైనా పేలాలు సంపాదించి పేలాలపిండి చేసేది :)) నేను,తమ్ముడు ఆ పిండి నోట్లో పెట్టుకోవడం..ఒకళ్ళమీద ఒకళ్ళు ఉఫ్ఫు...ఉఫ్ఫు అని జల్లుకోవడం...హ్హహ్హహ్హా...అది ఇల్లంతా పడీ..ఆగమాగం చేసేవాళ్ళం...నాకెంతిష్టమో! మీరు చేసిన పేలాలపిండి నాకు పార్సెల్ చేద్దురూ!

లత

కొరియర్ చెయ్యనా ఇందూ,అంత ఇష్టమా.
కొన్ని జ్ఞాపకాలు తలచుకుంటే మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోతాము.థాంక్యూ

జయ

బాగుంది లత గారు. ముఖ్యంగా పేలాలపిండి మీ మొహం మీద పడటం ఊహించుకుంటే ఇంకా బాగుంది:)

లత

థాంక్యూ జయగారు,అవునండి ఇప్పటికీ తలచుకుంటే నవ్వొస్తుంది.

Vinay Chakravarthi.Gogineni

మొక్కజొన్నలు కాకుండా.........జొన్న పేలాలు చెసె వారు మా అమ్మగారు. నిజంగా చాలా బాగుండేది..మరలా గుర్తుకు తెచ్హారు..చాలా thanks

లత

అవును చక్రవర్తిగారు,మా చిన్నప్పుడు జొన్న పేలాలు అమ్మొచ్చేవి.అవి కొని పిండి చేసేవారు

మాలా కుమార్

మా ఇంట్లో ఈ పేలపిండి అలవాటు లేదు . మాకసలు తెలీదు కూడా .
తొలి ఏకాదశి రోజే మా తాతగారు చనిపోయారు :(

గీతిక బి

పేలాల పండుగ అన్నది కోస్తా వాళ్ళకు.. ప్రత్యేకించి కృష్ణా జిల్లా వాళ్ళకి సంబంధించిన పండుగేమో...! తొలి ఏకాదశి అందరికీ తెలిసిన పండుగే. కానీ ఆ రోజు పేలాల పిండి చేసుకుంటారని చాలా మందికి తెలీదు.

పైన.. పేలాల పిండి గురించి తెలి(వ్రా)సిన వాళ్ళందరూ కృష్ణా జిల్లా వారేనా...? అవునో, కాదో ఓసారి ఓటేసేయండి.

తొలేకాదశి రోజు బ్లాగుల్లో పేలాల మీద పోస్టులేమైనా కనిపిస్తాయా అని చూశాను. వ్రాసిన మీ ఒక్క పోస్టూ మిస్సయ్యానన్నమాట.

ఇంతకీ మీది కృష్ణా జిల్లానే కదూ...

గీతిక బి

లత

అవును గీతిక గారూ
క్రిష్ణాజిల్లానే, విజయవాడ దగ్గర

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008