Friday, February 18, 2011

జీవితం నేర్పిన పాఠం

జీవితంలో మార్పు సహజమే.కాలం గడిచేకొద్దీ ఎదురయ్యే అనుభవాలు 

ఎంతో కొంత  తమ ప్రభావాన్ని చూపుతాయి.మనుషులు అందరూ ఒకలా 

ఉండరు నిజమే కానీ ఒక్కొక్కరి మనస్తత్వాలు,స్వార్ధాలు చూస్తే ఆశ్చర్యం 

వేస్తుంది.

అందరినీ కావాలనుకోవడం,చేతనైన  సాయం చెయ్యడం,అతి మంచితనం 

కూడా పనికిరావేమో.ఒకరికి సహాయం చెయ్యడం తప్పని అనను కానీ 

దానికి ఒక లిమిట్ ఉండాలని మాత్రం బాగా అర్ధం అయ్యింది.ఎంత  చేసినా

విలువ ఉండదని,అదేదో తమ హక్కు అన్నట్టు ప్రవర్తిస్తారని చాలా

ఆలస్యంగా తెలిసొచ్చింది.


ఎవరి పనులు వాళ్లకి అయిపోవాలి ఎదుటివాళ్ళు ఎంత ఇబ్బంది పడినా

సరే. ఇదేమి స్వార్ధమో నాకు అర్ధం కాదు.వాళ్ళదే రూపాయి,మనది

కాదు.వాళ్ళు చేస్తే ఎంతో కష్టపడినట్టు,అదే మనం చేస్తే ఏముంది ఎంతసేపు

అంటారు.వాళ్ళ అవసరాలకీ మనమే తిరగాలి,మన అవసరాలకీ మనమే

తిరగాలి. ఇవన్నీ చూశాక ,అనుభవించాక విరక్తి వచ్చేసింది.అందుకే నేను 

మారుతున్నాను.మారక తప్పడంలేదు.


ఎవరైనా సరే ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు  అప్పుడే ప్రేమలూ,అభిమానాలు 

నిలుస్తాయి.ఒక్కసారి మనసు విరిగితే, తిరిగి ఆ ఆప్యాయత ఎప్పటికీ 

దొరకదు.






Post a Comment

5 comments:

Anonymous

నేను ఇలా ఎన్నోసార్లు అనుకుని ఇప్పటికి కూడా మారలేకపోయా.నాకే ఇలాంటి వాళ్ళు ఎందుకు తారసపడతారు అనుకునేదాన్ని.ఇప్పుడు మీ పోస్ట్ చూసాక నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని తెలిసింది.

చెప్పాలంటే......

anu nenu ade anukuntunnanu.....miru ade raasaaru...feel kaakandi lata miku todu memu vunnamu

అక్షర మోహనం

లత గారు..! కలత చెందకండి. ఇప్పటికైనా మారినందుకు సంతోషం. స్నేహం విలువ తెలిసినవాళ్ళతోనే కలవండి.

లత

అవును అనూ.అలాగే అనిపిస్తుంది, బాధేసి చివరకు విసుగొస్తుంది
లేదు మంజూ ఫీల్ అయ్యీ,అయ్యీ ఇప్పుడు అవడం మానేశాను

లత

అక్షరమోహనం గారూ,
అవునండీ థాంక్యూ

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008