Tuesday, February 8, 2011

స్ఫూర్తి

జీవితంలో కొన్నికొన్ని మనకి చాలా స్ఫూర్తిని ఇస్తాయి.ఒక మంచి పుస్తకం,ఓ 

మంచి పాట,ఒక గొప్ప సినిమా ఇలా కనీసం ఆ క్షణంలోనైనా మనని ఎంతో 

కొంత ప్రభావితం చేస్తాయి.కొన్ని ఎంతగా మనసుకు హత్తుకుపోతాయి

అంటే పదేపదే మనకి గుర్తొస్తూనే ఉంటాయి.అలాంటి వాటిలోకి ఈ పాటను 

చేర్చేయ్యొచ్చు.

సరళమైన పదాలతోఎంత బాగా రాసారో సిరివెన్నెల.ఈ పాట మొత్తం 

బావున్నా ప్రత్యేకించి ఈ చరణం నాకు చాలా చాలా ఇష్టం


జీవితాన్ని సంతోషంగా గడపటం చాలావరకూ మన చేతుల్లోనే ఉంటుంది 

కదా ఈ చరణం విన్నప్పుడల్లా ఆనందంగా బ్రతకాలనిపిస్తుంది.


తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని  మొక్కలా 

ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా 

అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా 

ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా 

ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా 

వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా 

 
పరుగాపక పయనించవే తలపుల నావ

కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ 

ఎదిరించిన సుడిగాలిని జయించినావా 

మది కోరిన మధుసీమలు వరించి రావా


Post a Comment

6 comments:

రాధిక(నాని )

అవునండి చాలా బాగుంటుంది .స్వర్ణకమలం సినిమాలో ని ఈ పాట బానుప్రియ మారినప్పుడు వస్తుంది కదా .. సిరివెన్నేలగారు అద్భుతంగా రాసారు

మాలా కుమార్

అవునండి ఈ పాట చాలా బాగుంటుంది .

లత

రాధికగారూ,మాలగారూ,
థాంక్స్ అండీ

ఇందు

Wow! naku chala ishtam ee paata.bhanu priya dance kooda chala baguntundi :)

జయ

అసలు స్వర్ణకమలం అంటే స్వర్ణకమలమేనండి. అందులో అన్నీ ఒకదాన్నిమించి ఒకటి ఉన్నాయి. చాలా మంచిపాట గుర్తు చేసారు.

లత

అవును ఇందూ, జయ గారూ
థాంక్స్ అండీ

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008