Tuesday, May 31, 2011

అమెరికా- అమెరికా

అమెరికా అందమైన దేశం.భూతలస్వర్గం.జీవితంలో ఒక్కసారైనా ప్రతివారు చూడాల్సిన ప్రదేశం ఒప్పుకుంటాను.ఆఫ్ కోర్స్ నాకు అమెరికా గురించి అంత ఏమి తెలియదు అనుకోండి అక్కడున్నస్నేహితులు చెప్పేమాటలు తప్ప.
వచ్చిన కొత్తలో డాలర్ టు రూపీ కన్వర్షన్ మాత్రం అద్భుతంగ ఉంటుంది,ఆ 
తరువాత లైఫ్ ఏమి ఉండదు ఇక్కడ అంటుంది ఓ ఫ్రెండ్,ఆ కంఫర్ట్స్అవీ వేరు
అలవాటుపడితే ఇండియా రాలేము అంటారు మరొకరు ఎవరి అభిప్రాయం వారిది .

కానీ అమెరికా వెళ్ళకపోతే జీవితం వ్యర్ధమనీ,ఏదో పొరపాటు జరిగిపోయింది  అంటే మాత్రం ఒప్పుకోను.ఎక్కడ ఉండే కష్టసుఖాలు అక్కడ ఉంటాయి.ఇవన్నీ
పక్కన పెడితే ఇది ఎందుకు రాస్తున్నాను అంటే,గత రెండు సంవత్సరాలుగా విసిగి ఉన్నాను కాబట్టి.

అసలు జరిగింది ఏమిటంటే ఒక ఆప్షన్ గా ఉంటుంది అని,వీలైతే m.sచేద్దామని
gre రాసాడు మా అబ్బాయి.మంచి స్కోరు వచ్చింది.కాంపస్ ప్లేస్మెంట్స్ లో
జాబ్  కూడా వచ్చింది.సో ఒక నిర్ణయం తీసుకోవలసిన టైంలో అక్కడ ఏ 
యూనివర్సిటీ లోనూ ఎయిడ్ ఇవ్వట్లేదు చదివితే టాప్ వాటిలోనే చదవాలి 
చేతిలో జాబ్ ఉండగా లోన్ పెట్టి వెళ్ళడం అనవసరం అనీ,అందులోనూ తను చేద్దామనుకున్న ఫీల్డ్ అక్కడ చాలా డౌన్ లో ఉండడంతో రిస్క్ ఎందుకనీ డ్రాప్ అయిపోయి జాబ్ లో చేరిపోయాడు.m.s చేస్తేనే ఫ్యూచర్ బావుంటుంది అనుకుంటే వెళ్ళు లేదంటే నీ ఇష్టం అని నిర్ణయం తనకే వదిలేసాము మేము 
ఇంతవరకూ బాగానే ఉంది 

ఇక చూడండి అమెరికా వెళ్ళడం లేదా అంటూ ప్రశ్నలు .అయ్యో అని జాలి 
చూపించడం,వెళ్ళాల్సింది అని సలహా ఇవ్వడం,మీరు పొరపాటు చేశారు వెళ్తే వాడే సెటిల్ అయ్యేవాడు అని కొందరు,పోన్లెండి జాబ్ లో కూడా పంపిస్తారులే అని సానుభూతి చూపించడం ఇలా అయినవాళ్ళు,బయటివాళ్ళు ఫ్రెండ్స్ 
ఒకరని కాదు అసలు అడగనివారు లేరు అనుకోండి.దేవుడా అనిపించేది.

ఒళ్ళుమండి ఇంట్లో వాళ్ళకి అయితే చెప్పేశాను అసలు మేము పంపించము ఇక ఆ టాపిక్ తేకండి అని.వాళ్ళదీ తప్పులేదు లెండి ఇంటికి ఒకరు అమెరికాలో ఉన్నఊళ్ళో నివాసం మరి ఏమిచేస్తాం.మాకు లేనిబాధ అందరికీ ఎందుకో అర్ధం అయ్యేదికాదు.అసలు హైదరాబాద్ లో జాబ్ వస్తే ఇంకా ఆనందం,అంతకంటే జీవితంలో ఏమి కావాలి అని చెప్పాలని అనిపించేది
ఎంత ఓపిక కావలసి వచ్చిందంటే చివరికి స్పందించడం మానేసి (టీవీ భాషలో)ఓ నవ్వునవ్వెయ్యడం అలవాటు చేసుకున్నాను.ఈ మొత్తం ఎపిసోడ్ లో నేను నివ్వెరపోయిన మరో సంఘటన మిత్రులొకరు చాలా కాజువల్ గా ఏముందండి మేము పంపించలా,వాళ్ళే సెటిల్ అవుతారు.అయ్యాక ఓ పాతిక
లక్షలు పంపిస్తే మేమూ సౌండ్ అయిపోతాము అన్నప్పుడు మాత్రం ఇలా
కూడా ఆలోచిస్తారా అనుకుంటే చాలా బాధ వేసింది.

ఇది ఎవరినీ నొప్పించాలని రాయడం లేదు.ఎవరి అభిప్రాయం వారిది.ఎవరి 
ఇష్టం వారిది.జీవితాన్నిఎలా ప్లాన్ చేసుకోవాలో ఎవరికి వారికి బాగా తెలుసు .
ఇది గ్రహిస్తే బావుంటుంది కదా.ఎక్కడైనా అది అమెరికా అయినా,ఇండియా 
అయినా సెటిల్ అయ్యేవరకూ కొంచెం స్ట్రగుల్ తప్పదు.ఈలోగానే ఇదంతా.

ఎప్పటినుండో ఈ టపా రాయాలని ఉన్నా,టైం రావాలి తను ఎన్నుకున్న మార్గంలో విజయం సాధించాక రాద్దామని ఆగాను.నా ఆనందాన్ని పంచుకుని మనస్ఫూర్తిగా సంబరపడ్డ బంధుమిత్రులకు,బ్లాగ్మిత్రులకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.
 

Post a Comment

14 comments:

కృష్ణప్రియ

అవునా లత గారూ,

అయ్యో.. పాపం అమెరికా వెళ్ళలేదా పాపం? --- Just kidding.
మీరన్నది అర్థమైంది. I am with you.. ఇదొక పిచ్చి ట్రెండ్. అంతెందుకు? మా పాప ఆరోతరగతి కొస్తే.. 'అయ్యో.. IIT కోచింగ్ చేర్పించట్లేదా? చదువు లో ఏమైనా వీకా? టెన్నిస్ లాంటి ఆటల్లో చేర్పించలేదా?' అని జాలి తెగ చూపిస్తున్నారు.

లత

థాంక్యూ క్రిష్ణప్రియ గారూ
నన్ను అర్ధం చేసుకున్నందుకు

సుజాత వేల్పూరి

మేము USAలో ఎక్కువ ఏళ్ళు ఉండకుండా వచ్చేసినపుడు మా బంధువుల్లో ఒకావిడ అన్నారు"ఏంట్రా అప్పుడే వచ్చేశారు? మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడని గర్వంగా చెప్పుకోడానికి లేకుండా చేశారు" :-((

అక్కడికి వెళ్ళకపోతే సానుభూతి చూపించడం మరీ ఆశ్చర్యం!

శిశిర

కంపెనీ వాళ్ళు పంపిస్తామన్నా మా తమ్ముడు ఇప్పుడు అమెరికా వెళ్ళను అన్నాడని అలాంటి అవకాశం వస్తే వదిలేసుకుంటారా? మీరైనా చెప్పి చూడలేకపోయారా అంటున్నారండి.:)) ఎక్కడ ఉండాలనుకుంటాడో తన ఇష్టం. తను తనకి నచ్చినట్టు సెటిల్ అయితే చాలు, ఏ దేశమైతే ఏమిటి? అన్నది మా ఆలోచన.

మాలా కుమార్

మేమూ మా పిల్లలని అమెరికా పంపాలని అనుకోలేదు . వాళ్ళ ఇష్టప్రకారము వెళ్ళారు . 10 ఇయర్స్ వుండి వచ్చేసారు . మా అబ్బాయి వాళ్ళు ఆరునెలల క్రితం మళ్ళీ వెళ్ళారు . మా అమ్మాయి పిల్లలకు చదువులు ఇక్కడే బాగున్నాయని ఇక్కడే సెటిల్ అయ్యారు . అన్నీ వాళ్ళ ఇష్టానికె వదిలేసాము .
మీ కష్టాలు బాగున్నాయి :)

జయ

పిల్లలు దగ్గిరలో ఉంటేనే బాగుంటుంది. ఏ దేశాలకో వెళ్ళి, ఎప్పుడొ చుట్టపు చూపుకొచ్చే స్వంత పిల్లలనే తలచుకుంటూ ఒంటరిగా బ్రతుకుతున్న ఎందరో పెద్దవారిని చూసాను. ఇక్కడకూడా అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటినుంచైనా కొంచెం మార్పు వస్తే బాగుండు.

లత

సుజాత, అదే ఆశ్చర్యం అండీ నాకూ
అవును శిశిరా, ఎక్కడైనా మంచిగా సెటిల్ అయ్యి హాపీగా ఉంటే చాలు
మాలగారూ, మా బాబు కూడా అంతేనండీ తనే చక్కటి నిర్ణయాలు తీసుకుంటాడు
జయగారు,నిజమండి చదువులకు ఇల్లు వదుల్తూ ఇప్పటికే గెస్ట్ లు అయిపొతున్నారు.కనీసం దగ్గరలో ఉంటే చాలా బావుంటుంది

ఇందు

లతగారూ...నేను రాయాలనుకున్నది మీరు రాసేసారేంటి? నా సొంత తమ్ముడి విషయంలో ఇదే జరిగిందండి..మీ అబ్బయి సిట్యుఎషనే! జియ్యారీలో మంచి స్కోర్ వచ్చినా ఒక టాప్ ఐటి కంపెనీలో జాబ్ వచ్చిందని....ముందు జాబ్ చేసి తర్వాత ఎమ్మెస్ చూద్దాం అని వాడు జాయిన్ అయ్యాడు... ఇక అంతే...అందరు మా తమ్ముడిమీద లీటర్లలీటర్ల జాలి కురిపించడమె! అయ్యొ!! మీ తమ్ముడు అమెరికా వెల్లలేదా...పోని నువ్వు వెళ్ళావుగా ఏదైనా దారి చూపించమ్మ మీ తమ్ముడికి అట! ఎంత చీదర వేస్తుందో ఈ మాటలు వింటుంటే! వాడేమన్నా ఉద్యోగం లేక బాధపడుతున్నడా? వాడి ఇష్టం వాడిది! అహా! బంధువులకి,మిత్రులకి ఇవేమి పట్టవు! అమెరిక అంటే గొప్ప! నామోహం...ఇక్కడ అంత సినిమా ఏంలేదు!అది వచ్చి ఉన్నవాళ్ళకే అర్ధమౌతుంది!

మీరు బాధ పడకండి!! ఈ విషయంలో నాది మీ మనసులో మాటే! :) ఇలాంటి మాటలని అస్సలు పట్టించుకోకూడదు! ఆ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి :)) సరేనా!!

లత

థాంక్స్ ఇందూ
అస్సలు బాధలేదు నాకు.ఎవరు ఏమన్న పట్టించుకోను కూడా.కాకపోతే ఇలా జరిగింది అని రాయలనిపించింది.
ఫస్ట్ జాబ్ మంచిదే వచ్చింది.ఇప్పుడు ఇంకా మంచి జాబ్ వచ్చింది.సో ఇంకా హాపీస్ అన్నమాట.

చందు

నన్ను ఇలాగే చాలామంది మీ తోబుట్టువులని ఎందుకు తేలేదు, మీ ప్రాణ మిత్రులని ఎందుకు తీసుకు రాలేదు అని అడుగుతారు. అమెరికా కెళితే జన్మ ధన్యం అన్న ఆశతో పెరిగే వాళ్ళకు అలా ఉంటుందేమో. నేను అడిగితే వాళ్ళు నువ్వే వెనక్కి ఒచ్చేయి అంటారు. అమ్మ, నాన్న కోసం గ్రీన్ కార్డ్ చేస్తానంటే, " నీ కోసం తప్పదు కాబట్టి ఒచ్చాము. మేము ఇంక రాము" అంటారు. అమెరికాలో సుఖంగా వుంటారేమో కానీ సంతోషంగా ఉండటం కష్టం. అసలు నేనే ఎందుకొచ్చానా అని అనుకుంటూ ఉంటా. మీరు బాగా చెప్పారు.

లత

థాంక్స్ చందుగారు

రాజ్యలక్ష్మి.N

లత గారు మీ పోస్ట్ బాగుందండి..
మీ post కి తగినట్లుగా వున్న ఒక వీడియో నేను ఇవాళ పోస్ట్ చేశాను చూడండి..
http://raji-rajiworld.blogspot.com/2011/06/blog-post_03.html

Vinay Chakravarthi.Gogineni

హహ్హహ...నెను ఎలాంటివి చాల ఎదుర్కొన్నాను. on-site offer reject చేసి job కూడ resign చేసి PHD join(IITM) అయ్యాను.ఇక చూస్కొండి నాపాట్లు .ఇప్పుదు అది ఒక గా prestige issue gaa మారిపొయింది.చాలా మంది చదువును చదువుగా కాకుండా ఇంతకంతే మంచి ఉద్యొగం వస్తుందనొ లెక JOB దొరకకనొ లెక AMERICAలో settle అవ్వలని చదువుతున్నరు.చాల బాధపడాల్సిన విషయం ఇది.

లత

మీ వీడియో చూశాను రాజి బావుంది

మీరు చెప్పింది నిజమే చక్రవర్తిగారు

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008