Monday, May 23, 2011

మనసా మాటాడమ్మా

ఒక మనసు పాడే మౌన గీతం ఇది.జీవితంలో ప్రేమ ఒక భాగం.ఆ ప్రేమ జీవితానికి చాల అవసరం కూడా.పసితనం నుండి మన చుట్టూ ఎన్నో ప్రేమలు అల్లుకుంటాయి.
తల్లిదండ్రుల ప్రేమ మనకి భద్రతనిస్తుంది .తోబుట్టువుల ప్రేమ తోడౌతుంది.
బిడ్డల ప్రేమ మనని మురిపిస్తుంది.స్నేహితుల ప్రేమ వెన్నెలలు కురిపిస్తుంది 
కానీ చివరివరకూ మనతో నడిచేదీ మనని నడిపించేదీ జీవిత భాగస్వామి ప్రేమ.కష్టమైనా సుఖమైనా ఏ పరిస్థితిలో నైనా నీకోసం నేనున్నాను అన్న ఈ ప్రేమ ఆఖరి శ్వాస వరకూ మన వెన్నంటే ఉంటుంది.
తలవంచి తాళి కట్టించుకుని చిరుజల్లుల తలంబ్రాల నడుమ చిటికెన వేలు పట్టుకుని కొత్త పెళ్లి కూతురిగా జీవితంలోకి అడుగు పెట్టే ఒక ఆడపిల్ల మనసు లోని భావం ఎంత అద్భుతంగ ఉంటుందో ఈ సాహిత్యంలో వినిపిస్తుంది. ఈ పాట సినిమాలో వచ్చే సందర్భం వేరే అయినా భావం మాత్రం మనసుని హత్తుకుపోతుంది.  
"నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ"  భార్యాభర్తల అనుబంధానికి ఇంతకంటే నిర్వచనం ఏముంటుంది.సిరివెన్నెల సాహిత్యం చిత్ర స్వరంలో 
ఎంత ఆర్ద్రంగా ఉంటుందో వినండి 







మనసా నా మనసా మాటాడమ్మా 
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా
మనసా 

చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో 
విన్నా నీ అనురాగపు తేనె పాటనీ 
మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో 
చూశా నీతో సాగే పూలబాటని
నీతో ఏడడుగులేసి నడిచిన  ఆ నిమిషం 
నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం 
నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ 
మనసా ....మాటాడమ్మా 


తల్లీ  తండ్రి నేస్తం  ఏ బంధమైనా 
అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా 
తనువూ మనసూ ప్ర్రాణం నీవైన రోజునా 
నాదని వేరే ఏదీ మిగిలి లేదుగా 
ఎగసే కెరటాల కడలి కలుపుకున్నవెనుక 
ఇదిగో ఇది నది అంటూ చూపగలర ఇంకా 
నీవు లేని లోకమింక నాకుండదంటూ 

మనసా.... మాటాడమ్మా

Post a Comment

8 comments:

శిశిర

బాగుంటుందండి ఈ సాహిత్యం. సినిమా వచ్చిన కొత్తల్లో టి.విల్లో ఎక్కువగా మార్మోగిపోయేది ఈ పాట.

మాలా కుమార్

ఈ పాట నాకు చాలా నచ్చుతుంది . దీని కోసం ఎంతవెతికానొ దొరకలేదు :)

రాజ్యలక్ష్మి.N

ఈ పాట బాగుంటుందండీ
పాట గురించి మీ పరిచయం కూడా చాలా బాగుంది...

లత

అవును శిశిరా నాకు చాలా ఇష్టం ఈ పాట
నాకూ వీడియో దొరకలేదు మాలగారూ,అందుకే ఆడియో పెట్టాను
థాంక్స్ రాజీ

తృష్ణ

నాక్కూడా చాలా నచ్చుతుందండి ఈ పాట. మంచి సాహిత్యం. యూ ట్యూబ్ లో చూసిన గుర్తు. ఇప్పుడు వెతికితే లింక్ దొరకలే. మొన్ననే ఇక్కడ వ్యాఖ్య రాసాను కానీ నా సిస్టమ్లో ఏదో ప్రోబ్లం వల్ల అది పబ్లిష్ అవ్వలేదు.

ఆ.సౌమ్య

నాకీపాట బలే ఇష్టమండీ, మంచి సాహిత్యం...చిత్ర చాలా బాగా పాడారు.

మధురవాణి

భలే భలే.. సేం పించ్..అనుకోకుండా ఇద్దరం ఒకే పాట గురించి రాసాం కదా! నేనూ ఒక 2-3 వారాల క్రితమే రాసాను డ్రాఫ్ట్స్ లో ఉంది ఈ పోస్ట్.. ఈ రోజే పోస్ట్ చేసాను.. మీ పోస్ట్ ముందే చూసుంటే నేను మళ్ళీ పోస్ట్ చేసేదాన్ని కాదేమో! :)

Unknown

నాకీపాట బలే ఇష్టమండీ, మంచి సాహిత్యం...నిజంగా మనసు మాట్లాడినట్టే ఉంటుంది thank u

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008