Tuesday, May 17, 2011

పుత్రోత్సాహం




ఆనందంతో మనసు నిండిపోవడం,మాటల్లో చెప్పలేని అనుభూతి,గాలిలో  తేలిపోతున్న ఫీలింగ్  ఇవన్నీ ఒక్కసారిగా చుట్టుముడుతున్నాయి.అవును పుత్రోత్సాహం తండ్రికే కాదు తల్లికీ ఉంటుంది కదా.నిన్నటి నుండీ ఆ ఉత్సాహమే మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది .కారణం మా బాబుకి తను కోరుకున్న కంపెనీలో,తనకు నచ్చిన చోట ఆఫర్ లెటర్ రావడమే.జీవితంలో ఇంతకంటే ఆనందించాల్సిన క్షణం ఇంకొకటి లేదేమో అనిపిస్తోంది.

ఎంత దూరమైనా,ఎన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది అంటారు. ఆ తొలి అడుగు కొంచెం నిరాశపరచినా,ఈ మలి అడుగులో విజయం సాధించినందుకూ,ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ప్రాక్టీస్ స్కూల్ అప్పుడు చేసిన వర్క్ నచ్చినా,హైరింగ్ ఫ్రీజ్ నడుస్తుండడంతో అప్పుడు జాబ్ ఇవ్వలేకపోయినా,ఇప్పుడు ఓపెనింగ్స్ రాగానే నువ్వు మాకు కావాలి అని పిలిచి ఆఫర్ ఇచ్చారు అంటే చెప్పొద్దూ ఎంత సంతోషం వేసిందో .నిజంగా మాటలు రావడం లేదు.పిల్లలు జీవితంలో మంచి స్థాయిలో సెటిల్ అవడమే కదా మనకి కావలసింది.ఇంత ఆనందాన్ని పంచుకోవడం కోసమే ఈ నాలుగు మాటలూ.
 

Post a Comment

15 comments:

శిశిర

:) మీకూ, మీ అబ్బాయికీ అభినందనలు.

Tejaswi

Congrats

Unknown

Congratulations..

తృష్ణ

Congratulations and Best wishes to your son !!

Sravya V

Congratulations !

durgeswara

shubham

జ్యోతి

Congratulations to you all... Wish you more happiness..

ఇందు

Wowww! Congratulations.....mari happies kadaa.....maaku enti specials???

లత

అందరికీ ధన్యవాదాలు.
మీ అందరి అభిమానంతో,అభినందనలతో మరోసారి మనసు నిండిపోయింది.
థాంక్యూ అండి,థాంక్యూ వెరీమచ్

లత

ఇందూ,
స్పెషల్స్ కావాలంటే మా ఇంటికి రావాలి మరి

జయ

మీ బాబుకు నా హృదయపూర్వక అభినందనలు. మీకు ప్రత్యేక శుభాభినందనలు. పిల్లలు జీవితంలో పైకి వచ్చి సుఖంగా క్షేమంగా, మంచి పేరు తెచ్చుకుని అందరూ మెచ్చుకోవటమే కదండి మనకు కావాల్సింది. ఉజ్వల భవిష్యత్తు తప్పకుండా సాధిస్తాడు. మరి నా స్వీట్సో.

లత

జయగారూ,థాంక్యూ వెరీమచ్
ఈ రోజు కోసమే ఇన్నాళ్ళూ ఓపికగా ఎదురు చూశామండి.
ఊ మీ స్వీట్స్ ....మా ఇంటికి వచ్చెయ్యండి స్వయంగా చేసి పెడతాను

మాలా కుమార్

మీకూ , మీ అబ్బాయి కీ అభినందనలండి .
మీ ఈ పోస్ట్ ఈ రోజే చూసానండి . లేట్ గా చెపుతున్నందుకు ఏమీ అనుకోకండి ప్లీజ్ .

లత

ఏమీ అనుకోను మాలగారూ
థాంక్యూ వెరీమచ్

మధురవాణి

లతా గారూ,
మీ అబ్బాయికి చాలా ఆలస్యంగా అభినందనలు.. :)

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008