Monday, April 25, 2011

మణి(న)దీపాలు



పిల్లలు.మణిదీపాలు.మన దీపాలు. కమ్మని కలలను కలబోసుకున్న మన ప్రేమలకూ,కోరికలకూ,ఆశలకూ ప్రతిరూపాలైన రేపటి స్వప్నాలు.మనం చూస్తుండగానే యిట్టే ఎదిగి పోతారు,వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బిజీ అయిపోతారు.నిజం.ఎంత మహా అయితే పదహారు పదిహేడేళ్ళు వాళ్ళు మన దగ్గర ఉండేది.ఒక్కసారి ఇల్లు వదిలారంటే ఇక గెస్ట్ లాగా వచ్చివెళ్ళడమే.

బాల్యం ఓ అందమైన వరం. అది దాటారంటే అంతే. ఏ పదేళ్ళు ఆనందంగా ఉంటారో. సెవెంత్ అయ్యిందంటే వత్తిడి మొదలు.టెన్త్, ఇంటర్ అంటే ఇక అంతే.మనం ఎంత టెన్షన్ పెట్టకపోయినా వాళ్ళ వత్తిడి వాళ్ళకి ఉంటుంది.ఐ.ఐ.టి.లు,బిట్స్,ఎంసెట్ లు, ఆ సెట్ లు, ఈ సెట్ లు అబ్బో ఎన్నో... ఊపిరాడదు.ప్రొఫెషనల్ కోర్స్ అమ్మయ్య అనుకుంటే ఇంటి నుండి దూరంగా హాస్టల్ బ్రతుకు తప్పదు అఫ్ కోర్స్,  అది బానే ఉంటుంది అనుకోండి.మళ్లీ అక్కడ పరిక్షలు,జి.ఆర్.యి అని అదనీ ఇదనీ,ఇంకా కాంపస్ జాబ్స్ కోసం ప్రెపేర్ అవడం సరిపోతుంది.

ఇక్కడ ఓ చిన్న విషయం చెప్పాలి.2009 లో పాస్ అవుట్ అయ్యారు మా బాబు వాళ్ళు.అప్పుడు ఎంత పీక్ రేసేషన్  అంటే అసలు ప్లేస్ మెంట్స్ కి కాంపస్ కి చాల తక్కువ కంపెనీస్ వచ్చాయి.చేతిలో రెండు మూడు జాబ్స్ తో బయటికి రావలసిన వాళ్ళు దొరికిన దానితో సరిపెట్టుకోవలసి వచ్చింది.ఆ  నెలరోజులూ ఎంత స్ట్రగుల్ అయ్యారంటే ఇక్కడనుండే ప్రతి రోజూ మాట్లాడుతూ ధైర్యం చెబ్తూ మానిటర్ చేసుకోవలసి వచ్చింది.ఆ బాచ్ లోని  అందరూ కూడా మెల్లగా ఇప్పటికి సెటిల్ అవుతున్నారు.ఎందుకు ఇది చెప్పానంటే వాళ్ళకీ ఎంత వత్తిడి ఉంటుందో అని అంతే.వర్క్ ప్రెషర్ తట్టుకుంటూ,పోటీని సమర్ధంగా ఎదుర్కొంటూ జీవితమంతా ఇక పరుగు పందెమే.ఒక్కోసారి ఇదంతా చూస్తుంటే దిగులేస్తుంది.

అయినా ఈతరం పిల్లల్నిచూస్తే ముచ్చటేస్తుంది,వాళ్లకి వాళ్ళ ప్రయారిటీస్ ఖచ్చితంగా తెలుసు.తమకి ఏం కావాలి అన్నది తెలుసు.బాధ్యతలు పంచుకోడం తెలుసు మధ్యతరగతి జీవితాల్లోని కష్టాలు తెలుసు.కన్నీళ్లు తెలుసు.అన్నిటినీ మించి జీవితాన్నిఎలా ప్లాన్ చేసుకోవాలో మనకంటే బాగా తెలుసు.

బాల్యం ఒక గొప్ప వరం అంటారు.ఏమీ తెలియని పసితనం,అమాయకత్వం,
ఏ చిన్నకష్టం వచ్చినా అమ్మా అంటూ చుట్టేసే ఆ నిశ్చింత,ఎదిగేకొద్దీ ఏమై పోతాయో.అందుకే పిల్లల్ని చూస్తే తెలియని ఉద్వేగం కలుగుతుంది.
ఆకాశమంత ప్రేమను పంచి ఇవ్వాలనిపిస్తుంది.ఎప్పటికీ వాళ్ళు మనకి  చిన్నారులే.మన కంటిదీపాలే కదా మరి.




Post a Comment

5 comments:

చెప్పాలంటే......

లత గారు మీరు రాసింది చదువుతుంటే మనము కుడా అలానే అనుకున్నాము కదా అనిపించింది. బాల్యం ఎప్పటికీ తిరిగిరాని తీపి జ్ఞాపకమే అయినా ఇప్పటి పిల్లలు చాలా మిస్ అయిపోతున్నారు

శిశిర

:) అమ్మ కదా మీరు. అందుకే బాగా చెప్పారు.

మాలా కుమార్

పిల్లలు ఎదుగుతువుంటే గమనించటము , ఆశ్చర్య పోవటము , అబ్బురపడటము ఓ గొప్ప అనుభూతి . కొన్ని సార్లు వీళ్ళ మన పిల్లలేనా ? మనం పెంచినవాళ్ళేనా అనిపిస్తుంది .ఎంతలో ఎదిగిపోయారు అని కొన్ని సార్లు దిగులేస్తుంది కూడా ! చాలా బాగా రాశారు .

జయ

నేను ఇప్పుడే కాదు, నాకు అరవై ఏళ్ళు వొచ్చినా కూడా మా అమ్మతో చేయించుకుంటానండి:)మీరు చెప్పిన ప్రతి అంశము జీవితచక్రం ఇదే అని చూపిస్తుంది. బాగా చెప్పారు. ఇప్పటి పిల్లల ఆలోచనలు, ప్రణాళికల గురించి Mr.పర్ఫెక్ట్ సినిమాలో బాగా చూపించారండి.

లత

అవును మంజు అలాగే అనిపిస్తుంది
శిశిరా మీ కామెంట్ మనసుని నింపేసింది
మాలగారు,అవునండి ఒకొసారి నిజంగా దిగులేస్తుంది
జయగారు,అవునండి జీవితచక్రమే ప్రతి దశా మళ్ళీ కనిపిస్తుంది
వీలైతే సినిమా చూస్తాను అండి
అందరికీ ధన్యవాదాలు

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008