మొహమాటమా, నో
మనిషికి అసలు ఉండకూడనిది ఈ మొహమాటం.నిజంగా కొన్నికొన్ని పనులు మొహమాటం కొద్దీ నెత్తిన వేసేసుకుంటాము ఎవరమైనా.అవి చిన్నవీ కావొచ్చు,పెద్దవీ కావొచ్చు.ఇక అది ఎడ్వాంటేజ్ గా తీసుకుని ప్రతి పనీ అప్పచెప్పేవాళ్ళు కోకొల్లలు.అయినవాళ్ళు అయినా,బయటివాళ్ళు అయినా హాపీగా పనులు అంటగట్టేస్తారు
అందులోనూ హలో అంటే చాలు ఓయ్ అని పరిగెత్తే స్వభావం ఉన్నసాధు ప్రాణులనైతే ఇక చెప్పక్కర్లేదు.ఫుట్ బాల్ ఆడుకున్నట్టు ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు.ఇలా వందసార్లు చేసి నూటొకటో సారి చెయ్యకపోయినా కుదరలేదు ఏమో అని మాత్రం అనుకోరు.నిష్టూరాలు,నిందలు తప్పవు.మన మంచితనం గుర్తు ఉండదు నిజంగా సాయం అవసరమైతే చెయ్యొచ్చు.కానీ ముందునుండీ ఎంతలో ఉండాలో అంతలో ఉంటే ఈ ఇబ్బందులు రావు.
మొదట్లోనే చిరునవ్వుతో నో చెప్పడం నేర్చుకుంటే మంచిది.అక్కడితోనే అయిపోతుంది.ఎవ్వరమైనా సరే ఒకరిని ఇబ్బందిపెట్టకూడదు.ఒకరికోసం ఇబ్బంది పడకూడదు.ఈ సూత్రం ఫాలో అయితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఏమో
Post a Comment
5 comments:
అవునండీ. బాగా చెప్పారు.
avunandi. nenu chaalaa edurudebbalu tinnanu. jeevitham antaa mohamatam thone gadichipindi. ippude kaasta maarutunnanu. mee blog paata nenu pratirojoo paadukuntaanu. ee paata naaku chaala ishtam.
అందుకేగా బిచ్చగాని సామెత " పెట్టనమ్మ ఎట్లానూ పెట్టదు పెట్టే నీకేమొచ్చింది ?" వచ్చింది :)
one of the most difficult things to learn and to implement.
నిజం శిశిరా
సమీరా ఎప్పటికైనా మారక తప్పదండి
మాలగారు ఈ సామెత అర్ధం, చేసేవాళ్ళ గురించి అనుకుంట అవునా
కొత్తపాళీగారూ,
నిజమేనండి చాల కష్టమైన పని
Post a Comment