ఈ జ్ఞాపకాలు మధురం
ఇరవై మూడేళ్ళు.
కాలం ఎంత త్వరగా పరుగులు తీస్తుందో.నిన్నోమొన్నో జరిగినట్టు అనిపించే సంఘటనలు అన్నీ జ్ఞాపకాలై మదిలో దోబూచులాడు తున్నాయి.
రధసప్తమి నాడు తెల్లవారు జామున ఈ ప్రపంచం లోకి రావడానికి తహతహలాడుతున్న నా బిడ్డని తలచుకుని ఎందుకో తెలియదు ఆ క్షణం నా మనసులో మెదిలింది
కళ్యాణ రామునికి కౌసల్య లాలి,
యదువంశ విభునికి యశోద లాలి
అంతలోనే చిరునవ్వు విరిసింది. ఆప్యాయంగా అనుకున్నాను నీ కోసం నేనెవరిని కాను కన్నా అని.లేత గులాబి రంగు చెక్కిళ్ళు ,మూసి ఉన్న గుప్పెళ్ళు,చిట్టి చిట్టి పాదాలు ,ఆ లేలేత స్పర్స ,తొలిసారి తనని చూసిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేను.
పుట్టిన పది రోజులకే జబ్బు చేసి డాక్టర్ ఆయిల్ ఇంజెక్షన్స్ చేస్తుంటే భయంతో వాడు దక్కుతాడో లేదో అని చిగురాకులా వణికిపోయిన నా నిస్సహాయత ఇంకా నాకు గుర్తుంది.ఎలా అయితేనే అన్నీ తట్టుకుని వాడు పెరిగాడు
మగపిల్లలు లేకపోవడంతో డాడీ ఎప్పుడూ అనేవారు వీణ్ణి ఇంజినీర్ ని చేసి నీకు అప్పచెప్తాను నాకు ఇచ్చేయ్యమ్మాఅని. పైకి నవ్వేసినా లోపల అమ్మో అనుకునేదాన్ని.
ఒక్కరోజు కూడా వదలకుండా అపురూపంగా పెంచుకున్నాను.తన బాల్యాన్నిఆస్వాదించాలి అన్న కారణంతో
ఉద్యోగం మాటే ఎత్తలేదు నేను.చాలా మెత్తని స్వభావం తనది.చాలా చిన్నప్పుడు కూడా చిన్న సన్నజాజి కొమ్మ ఇస్తే అరగంట ఆడుకునే వాడు.వాళ్ళ డాడీ కలర్ ఫుల్ గా ఉండే బుక్స్ తెస్తే చదువుకుని తన దిండు కింద పెట్టుకుని పడుకునేవాడు.చిన్నప్పుడు బజారు వెళ్తే చాలు అయిస్క్రీం షాప్ దగ్గర ఆగిపోయేవాడు.ఎంతగా అంటే మమ్మల్ని చూస్తూనే షాప్ అతను తనకి నచ్చే ఫ్లేవర్ కప్ తీసి బయటపెట్టేవాడు.
hps లో చదివించాలని మావారికి కోరిక.ఫస్ట్ క్లాస్ కి ఎంట్రన్సు రాయించడానికి వచ్చాము.నాకు బాగా గుర్తు.పరిక్ష రాసాక ఏడుస్తూ వచ్చాడు.మాత్స్ బాగా చేశాను ఇంగ్లీష్ సరిగ్గా రాయలేదు అని.అంత సున్నితంగా ఉండేవాడు.సీట్ వస్తే తన చదువు కోసమే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము మేము .
సన్నగా ఎంత అమాయకంగా ఉండేవాడు అంటే అసలు పెద్దయ్యాక ఎలా బ్రతుకుతాడో ఈ లోకంలో అనుకునేదాన్ని.అలాంటిది ఒకసారి టెన్త్ క్లాస్ కి వచ్చి ఎక్స్పోజర్ వచ్చాక ఆటోమాటిక్ గా ఆ మెచ్యూరిటీ వచ్చేసింది.చదువు పూర్తయ్యేసరికి ఇంకా ఇండివిడ్యువలిటీ,డెసిషన్ మేకింగ్ వచ్చేసాయి. ఇంజినీరింగ్ కి రాష్ట్రం కానీ రాష్ట్రం హాస్టల్ కి వెళ్తోంటే ఎంత బాధ వేసిందో.ఇంక తరువాత అలవాటు అయిపోయింది అనుకోండి.జాబ్ చేస్తున్నా, ఇప్పటికీ వచ్చి వెళ్ళాక ఒక రోజంతా ఆ బాధ ఉంటుంది.
ప్చ్, ఏమిటో మనని కన్నవాళ్ళని వదల్లేక ఒకప్పుడు బాధ.మనం కన్నవాళ్ళని వదల్లేక ఇప్పుడు బాధ.
ప్రతివారికీ ఈ ఫేజ్ తప్పదు కదూ.ఎవరి జీవితాలు వాళ్ళవి.మనం ఎలా వదిలేసి వచ్చేసామో మన పిల్లలూ అంతే.
అందరూ అంటారు తనని చూస్తే లతను చూడక్కర్లేదు అని. అంత జిరాక్స్ కాపీ అన్నమాట నాకు.
వావ్,పిల్లలు మన కళ్ళ ముందే ఎంత ఎదిగిపోతారో కదా అనిపిస్తుంది. దేనికైనా తన సలహా అడుగుతాను నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలను హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని.
ఎన్ని కబుర్లు చెప్తాడో .
మే బీ ప్రతి తల్లి ఇలాగే ఫీల్ అవుతుందేమో తన బిడ్డని తలచుకుని.నా మనసులోని అనుభూతిని రాయాలని అనిపించింది.
ఎక్కడ పుట్టి పెరుగుతుందో తెలియదు తన మనసు అర్ధం చేసుకుని,తోడవ్వగల ఓ బంగారుతల్లి తన జీవితంలోకి రావాలని,నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా బాబుకి, పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్నా
Post a Comment
10 comments:
బాగుందండి మీ అమ్మ మనసు. మీ అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు.
లత గారు మీ ఙ్నాపకాలు నిజంగా మధురం...మీ అబ్బయికి పుట్టిన రోజు శుభకాంక్షలు..
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాబుకి, పుట్టిన రోజు శుభాకాంక్షలు.
నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
లతగారు, ప్రతి తల్లి ఇలాగే అనుకుంటుంది. మీ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. త్వరలో మీకు మంచి కోడలు రావాలని కోరుకుంటున్నాను. అత్తా కోడలు సఖ్యంగా ఉంటేనే కదా అబ్బాయి కూడా ఆనందంగా ఉండేది.అతను కోరుకునేది కూడా అమ్మలాటి ఆలి రావాలని..:) just kidding...
మీ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
శిశిరగారూ,నైమిష్ గారూ,
మంజుగారూ,జ్యోతిగారూ,
అనుగారూ,
అందరికీ ధన్యవాదాలు అండీ.
Sorry latha garu.Konchem aalasyanga mee blog chusa.Im very sorry.Many Many Happy returns of your best friend's Birthday :)
>>ఎక్కడ పుట్టి పెరుగుతుందో తెలియదు తన మనసు అర్ధం చేసుకుని,తోడవ్వగల ఓ బంగారుతల్లి తన జీవితంలోకి రావాలని,నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Naaku ee words chala nachayi :) Meelaage andaru ammalu unte entha bagundo kadaa :)
థాంక్యూ వెరీమచ్ ఇందూ
లత గారు ఆలస్యంగా శుభాకాంక్షలు చెబుతున్నదుకు ఏమీ అనుకోకండి .మీ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.
ఏమీ అనుకోను రాధిక గారూ
థాంక్యూ వెరీమచ్
Post a Comment