సంక్రాంతి ఊసులు
ముత్యాల ముగ్గుల్లో,ముద్దబంతి గొబ్బిళ్ళో
అంటూ సంక్రాంతి ఎన్నో జ్ఞాపకాల సిరులను మోసుకొస్తుంది.ధనుర్మాసపు
వణికించే చలికి మంచు దుప్పట్లు కప్పుకుంటూ,బంతి పూల తోరణాలతో,
కళకళలాడే రంగవల్లులతో,చేతికొచ్చిన పంటల సిరులతో పల్లె లోగిళ్ళు
విలసిల్లుతాయి.
వణికించే చలికి మంచు దుప్పట్లు కప్పుకుంటూ,బంతి పూల తోరణాలతో,
కళకళలాడే రంగవల్లులతో,చేతికొచ్చిన పంటల సిరులతో పల్లె లోగిళ్ళు
విలసిల్లుతాయి.
చిన్నప్పుడు సంక్రాంతి సెలవులకి ఎక్కువగా మా
పెద్దమ్మ గారి ఊరు వెళ్ళేవాళ్ళం.తనకి ఒక
పాప, బాబు.మేము ముగ్గురం చాలా క్లోజ్ గా
ఉండే వాళ్ళం.
పల్లెటూరు కదా చాలా పెద్ద వాకిలి ఉండేది రోజూ
చుక్కలు పెట్టి ముగ్గులు వెయ్యడం,కొత్తవి నేర్చుకోవడం సరదాగా
ఉండేది.అమ్మగారికీ దండం పెట్టు,అయ్యగారికి దండం పెట్టు అంటూ
గంగిరెద్దుల మేళాలు,కీర్తనలు పాడుకుంటూ హరిదాసులూ సందడి చేసే
వారు.
హడావుడి .చలిమిడి తింటూ నువ్వులు అద్దడమో,
వండిన అరిసెలు ఆరపెట్టడమో ఏదో ఒకటి మా పిల్లల పని.
వండిన అరిసెలు ఆరపెట్టడమో ఏదో ఒకటి మా పిల్లల పని.
ఇక పండగ మూడు రోజులూ ఒకటే హడావుడి.
సాయంత్రమే కళ్లాపి చల్లి వాకిలి రెడీ చేసే వారు.
చుక్కల ముగ్గులు కాకుండా ముగ్గు గొట్టాలతో
అమ్మ,పెద్దమ్మ వేస్తూ ఉంటే మేము అంచులు
కలపడం,మధ్యలో సున్నాలు చుట్టడం చేసే
వాళ్ళం.
అంతా అయ్యాక ఆ సున్నాలలో పసుపు
కుంకుమలు,రేగుపళ్ళు,చెరకు,బెల్లం ముక్కలు పెట్టేవాళ్ళం
ముగ్గుల మధ్యలో బంతి,కారబ్బంతి పూలు ఉంచి మురిసిపోయే వాళ్ళం.
సాయంత్రాలు యిట్టే గడిచి పోయేవి.
ఇక పండగ నాడు తలంటు,కొత్త బట్టలు,గారెలు,
చక్రపొంగలి,ఆవడలు తప్పనిసరి. వీటన్నినిటిలో
ఆవడలు నా ఫేవరేట్ .రోట్లో వెన్నలా రుబ్బి వండిన
గారెలు, చిలికిన చిక్కని పెరుగులో నాని
నోట్లో వేసుకుంటే కరిగి పోయేవి.
ఒకసారి నేను అడిగానట. మళ్లీ సంక్రాంతి ఎప్పుడు అని.ఇంకా ఏడాది ఆగాలి,
ఎందుకమ్మా అన్నారు.సంక్రాంతి వస్తే ఆవడలు తినొచ్చు కదా అన్నాను.
అయ్యో ఆవడలకి సంక్రాంతి దాక ఎందుకు అని ఎప్పుడైనా చేసుకోవచ్చు
అని అప్పటినుండీ ఎప్పుడు గారెలు వండినా నాకోసం ఆవడలు సిద్దం.
చక్రపొంగలి,ఆవడలు తప్పనిసరి. వీటన్నినిటిలో
ఆవడలు నా ఫేవరేట్ .రోట్లో వెన్నలా రుబ్బి వండిన
గారెలు, చిలికిన చిక్కని పెరుగులో నాని
నోట్లో వేసుకుంటే కరిగి పోయేవి.
ఒకసారి నేను అడిగానట. మళ్లీ సంక్రాంతి ఎప్పుడు అని.ఇంకా ఏడాది ఆగాలి,
ఎందుకమ్మా అన్నారు.సంక్రాంతి వస్తే ఆవడలు తినొచ్చు కదా అన్నాను.
అయ్యో ఆవడలకి సంక్రాంతి దాక ఎందుకు అని ఎప్పుడైనా చేసుకోవచ్చు
అని అప్పటినుండీ ఎప్పుడు గారెలు వండినా నాకోసం ఆవడలు సిద్దం.
కనుమ నాడు మరో హడావుడి.కోళ్ళు కోసి ,పలావు చేసేవారు.పెద్ద గిన్నె
కట్టెల పొయ్యి మీద పెట్టి,ఎక్కడో తెలుసుకున్న రెసిపీని జాగ్రత్తగా ఫాలో
అవుతూ చేసి, పైన మూత మీద నిప్పులు పోసి,అడుగంటుతుందేమో అని
టెన్షన్ పడుతూ ఎలా అయితేనే పూర్తయ్యేది.నానా హంగామా
అన్నమాట.ఇప్పుడు ఎంత ఈజీగా బిర్యానీలు చేసేస్తున్నామో కుక్కర్ లలో
అనిపిస్తుంది నాకు అది తలచుకుంటే.
ఇక ఈ సెలవుల్లో మధ్యాన్నాలు మా ఇష్టం.ఇంటికి
వెనుక వైపు సిరిసింత చెట్లు ఉండేవి. వాటినే
సీమచింతకాయలు అని కూడా అంటారు.కర్రకి
కొక్కెం కట్టిఎర్రగా మగ్గిన కాయలు కోసుకుని
తినేవాళ్ళం.
చింతపిక్కలు,వామన గుంటలు ఆటలు ఆడుకునే
వాళ్ళం.అన్నట్టు సెలవుల మధ్యలో పక్కనే ఉన్న
టౌన్ లో ఒక సినిమా ట్రిప్ తప్పకుండా ఉండేది.
పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరి దారి వారిది అయిపోయింది.పండగ పూట
ఆత్మీయులు అందర్నీఫోన్ లో పలకరించుకుంటాము.కాకపోతే ఒకరికొకరం
దూరంగా ఉంటున్నాము అంతే.ఇప్పుడూ కళ్లాపులు లేకపోయినా
ముగ్గులూ,బంతిపూల తోరణాలు .పిండివంటలు,తోడుగా టీవీ చానెల్స్
అన్నీ ఉంటున్నాయి.
ఎప్పుడైనా మా పిల్లలతో సహా అలా ఓ సంక్రాంతి పూట అంతా కలిసి
గడపాలని చిన్న కోరిక,ఆశ.ఎప్పుడు తీరుతుందో కాలమే చెప్పాలి.
Post a Comment
7 comments:
baavunnayi mi sankranti kaburlu
సీమ చింత కాయలు చూసి, తిని చాలా ఏళ్ళు అయింది. గత 15 ఏళ్లగా హైదరాబాద్ లో చూడలేదు. మీ సంక్రాంతి సంబరాలు బాగున్నాయి.
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
బాగున్నాయండి మీ సంక్రాంతి విశేషాలన్నీ.
థాంక్స్ మంజూ,
సుబ్రహ్మణ్యం గారూ,
అవునండీ ఇక్కడ ఎక్కడా కనపడవు సీమ చింతకాయలు.
నచ్చినందుకు థాంక్యూ అండీ.
రాధికా థాంక్యూ.
chala bagunnaay mee sankranti sambaraalu lathagaru.chala haayigaa undi me post chadivite. :)
మా చిన్నప్పటి సంబరాలు ఇందూ ఇవి. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.థాంక్యూ
బాగున్నాయండి మీ ఊసులు. మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు.
Post a Comment