Thursday, November 10, 2011

కార్తీకంలో బ్లాగ్ వనభోజనాలు

కార్తీకం అంటేనే సందడి.పూజలు,ఉపవాసాలు,కార్తీక దీపాలు.మధ్యలో వనభోజనాలు,మనసు ఎక్కడికో  వెళ్ళిపోతుంది.ప్రతి నెలా పౌర్ణమి వస్తూనే ఉన్నాకార్తీక పున్నమి ప్రత్యేకతే వేరు.నిండుచంద్రుని వెన్నెల్లో,వెలిగే దీపాల నడుమ,భక్తి ప్రపత్తులతో,సరదాల పరదాలతో సాగే భోజనాలు నిజంగా అపురూపమే. 

ఇక వనభోజనాలు.

విశాలమైన తోటల్లోఉసిరిచెట్ల కింద భోజనాలు ఒకప్పుడైతే బ్లాగుల ముంగిట ఘుమఘుమల పరిమళాలు ఇప్పుడు.
మరి ఈ వెన్నెల వెలుగుల్లో నా వంటలు కూడా రుచి చూసేయండి.ఉపవాసంతో అలసిపోయే  పెద్దలకు,పిన్నలకు రుచితో పాటు పోషకాలు కూడా ఇచ్చే ఈ తీయతీయని బాదం ఖర్జూర పాయసం చేసుకుందాం.దీన్నేఆల్మండ్ డేట్స్ ఖీర్ అని పిల్చుకున్నా వాకే .

 


 కావలసినవి 


చిక్కని పాలు                       పావు లీటరు 
ఖర్జూరాలు                          పది 
బాదంపప్పు                         పది 
ఇలాచీ పొడి                        అర స్పూను 
మిల్క్ మెయిడ్                   రెండు టేబుల్ స్పూన్స్  


ముందుగా బాదంపప్పును వేడినీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసేయ్యాలి.
ఖర్జూరాలు గింజలు తీసేసి కొంచెం నీటిలో ఉడికించాలి.
ఈ రెంటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అవసరమైతే కొంచెం పాలు వాడొచ్చు.
ఇప్పుడు పాలను కొంచెం మరిగించి బాదం ఖర్జూర మిశ్రమం వేసి కొంచెం ఉడికించాలి.
చివరగా మిల్క్ మెయిడ్ వేసి కలపాలి.ఇది లేకపోతే తగినంత పంచదార వేసుకోవచ్చు.
ఇలాచీపొడి వేసి కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.చల్లారాక ఇంకా చిక్కగా అవుతుంది 
సన్నగా తరిగిన బాదం,ఖర్జూరాలతో అలంకరించుకోవాలి. 

అంతేనండి చాలా సులువు కదా.కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తింటే రుచి కూడా అంత మధురంగానూ ఉంటుంది. 


ఇక కార్తీకమాసంలో నేతిబీరకాయ పచ్చడి తినాలంటారు.ఇక్కడేమో మరి అవి దొరకవు కదా.
అందుకని బీరకాయతో, టమాటా కలిపి ఈ పచ్చడి చేసుకుందాం.వనభోజనాలకు బ్రహ్మాండంగా ఉంటుంది.




కావలసినవి

బీరకాయ                           ఒకటి పెద్దది
టమాటా                            ఒకటి పెద్దది 
కొత్తిమీర                            అర కట్ట
పచ్చిమిర్చి                         ఆరేడు 
వెల్లుల్లి                             నాలుగు రెబ్బలు 
ఉప్పు,జీలకర్ర,చింతపండు,నూనె 


బీరకాయ చెక్కు తీసి ముక్కలు కోయాలి.
వీటిలో మిర్చి,టమాటా ముక్కలు,కొత్తిమీర వేసి రెండు స్పూన్ల నూనె వేసి నీరుపోయి బాగా దగ్గరయ్యేవరకు మగ్గనివ్వాలి.
మిర్చి,ఉప్పు,వెల్లుల్లి,జీలకర్ర,చింతపండు కలిపి ఒకసారి గ్రైండ్ చేసి,ఉడికిన బీరకాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేయ్యడమే. 

రెండూ రుచి చూసేసి ఎలా ఉన్నాయో చెప్పండి మరి.మళ్ళీ వచ్చే ఏడు మరిన్ని చేసుకుందాం

















Post a Comment

17 comments:

మాలా కుమార్

బాదం కర్జూరం పాయసం ఘుమ ఘుమ లాడిపోతొంది .

శిశిర

మీరు మామూలుగా చెప్పినవే చాలా బాగుంటాయి. ఇక ప్రత్యేక సందర్భాలకోసం చెప్పేవాటి గురించి వేరే చెప్పాలా? భలే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా. మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది.

సుభ/subha

dates kheer baagundandii.. try chesi chustaa.. thx for ur recipe.

జ్యోతి

లతగారు మా లంచ్ టైమ్ ఇంకా కాలేదు. తిన్నాక వచ్చి చెప్తాను ఎలా ఉన్నాయో. కుటోలు, ప్రాసెస్ చూస్తుంటే ఇవాళ డబల్ డోస్ తప్పదు అనిపిస్తుంది. భయంగా ఉన్నా ఒక్కరోజు లైట్ తీసుకోవచ్చా అని ఆలోచిస్తున్నా..

కృష్ణప్రియ

నైస్.. బీర కాయ పచ్చడి మేమూ ఇంచు మించు ఇలాగే చేస్తాం..కానీ తొక్కు తీయము. కొత్తిమీర ఆఖర్న కలుపుతాము.

భమిడిపాటి సూర్యలక్ష్మి

బాదం ఖర్జూరం పాయసం బాగుందండి. చేసి చూస్తాను.

జయ

మీ దగ్గిర ఎప్పుడూ వన భోజనాలే కదండి. ఇంత అందమైన స్వీట్ అయితే ఇంకా అదిరిపోయింది.

లత

మీకు నచ్చిందా మాలగారూ థాంక్యూ
శిశిరా నీకు బోలెడు థాంకూలు
శుభగారు చేసి చూడండి

రసజ్ఞ

బాగున్నాయండీ మీ పాయసం ఘుమఘుమలాడుతోంది! బీరకాయ పచ్చడి ఇంచుమించు ఇలానే చేస్తారు మా ఇంట్లో కాని నేతి బీరకాయతో దోశలు లేదా వడలు వేస్తారు మా ఇంట్లో ఈ మాసంలో.

లత

జ్యోతిగారు ఒక్క రోజుకి ఏం కాదండి వనభోజనాలు కదా అన్నీ తినెయ్యడమే
కృష్ణప్రియగారూ అవునండి చిన్న చిన్న మార్పులు అంతే
సూర్యలక్ష్మిగారూ చేసెయ్యండీ
జయగారూ రోజూ వనభోజనాలే అంటారా ఓకే
అందరికీ ధన్యవాదాలండి

సిరిసిరిమువ్వ

స్వీట్ వెరైటీగా ఉందండి...చేసి చూడాలి.

ఈ హైదరాబాదులో నేతి బీరకాయ దొరకదేంటో! ఈ సారి మాకూ ఇంకా ఊరినుండి రాలేదండి.:(

జ్యోతిర్మయి

బాదం డేట్స్ ఖీర్ కొత్త వంటకం బావుందండీ..బీరకాయ పచ్చడి గురించి చెప్పనక్ఖరలేదు.

ennela

ఖీర్ చాలా బాగుందండీ ..నేను పిల్లల మీద ప్రయోగిస్తా...
కార్తిక మాసంలో నేతి బీరకాయలు తినాలని తెలీదండీ...ఒక కొత్త విషయం తెలిసింది..ఇక్కడ మాకు అలాంటి కాయలు దొరుకుతాయి...చేసేసుకుంటే సరి..రెసిపీ ఇచ్చారుగా మీరు! బాగుంది

లత

రసజ్ఞ నేతిబీరకాయ వడలా,ఎప్పుడూ వినలేదు.మా వైపు పచ్చడి మాత్రమే చేస్తారు

మువ్వగారు,అవునండి ఇక్కడ అసలు దొరకదు.మనవైపు దొరికే పొట్టి చిక్కుళ్ళు కూడా ఎప్పుడో తప్ప కనపడవు

రెండూ నచ్చాయా జ్యోతిర్మయి గారూ

ఎన్నెలగారూ,ఈమాసంలో తప్పనిసరిగా తింటారండీ,అందులోనూ పౌర్ణమి రోజున అయితే మస్ట్ అన్నమాట.చిట్టిగారెల్లోకి ఈ పచ్చడి భలే ఉండేది

ఇందు

ఈసారి బ్లాగ్వనభోజనాలు నేను మిస్ అయ్యా!!! :(( మీ ఖీర్ చూడటానికి సూపర్ :) ఇంకా పచ్చడి కూడా టెంప్టింగ్!! బాగున్నాయండీ మీ వనభోజన వంటలు :)

PALERU

naaku vandatam raadugaa hahaha....

Unknown

madam garu, mee blog chala colourful and attractive gaa vundhi.

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008