కాలమా

ఎడారిదారిలో గమ్యం తెలియని బాటసారిలా
ఎండమావిలా అందని మధురస్వప్నాల వెంట
ఆగని జీవనపయనం
జాలిలేని కాలం వడివడిగా పరిగెడుతూనే ఉంది.
ఇన్నాళ్ళూ,ఇన్నేళ్ళూ ఓపికతో పరుగులు పెడుతున్నా
అలసిపోయిన మనసు ఇక నావల్ల కాదంటోంది
నిన్నందుకోలేని నిస్సహాయతతో నామీద నాకే జాలేస్తోంది
కరిగేకాలం నన్ను చూసి నవ్వుతుంటే కనురెప్పల నీడల్లో
జాలువారే కన్నీరు నిశ్శబ్దపురాత్రిలో నాకు తోడౌతోంది
అయినా ఈ పయనం ఆగదు,అలసినా తప్పదు
సహనాన్ని కూడదీసుకుని,ఆశలపందిళ్ళు వేసుకుని
మళ్ళీ నీతో ప్రయాణం మొదలుపెడతాను
కాలమా, నాకోసం ఓనిమిషం ఆగవూ
Post a Comment
10 comments:
హ్మ్..
కాలం ఆగితే మనం ముందుకు వెళ్లటం కష్టమైపోతుందండీ...
రేపులో వెలుగుందని, స్వప్నాలని చేరుకోగలమనే ఆశతో పయనం సాగించటంలోనే గెలుపు రహస్యం దాగిఉందన్న మీకు తెలియనిదా..:)
ఆ కాలం 20 సంవత్సరాల క్రితమే ఆగిపోతే బాగుండు . మన మాట వినదుకదా !
బాగుందండి
మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బాగుందండి. మీకు నా హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
చాలా బాగుందండీ.... :)
చాలా బాగుంది లత గారూ!
మీ అభిరుచి ...నోరూరిస్తోందండీ!...:-)
@శ్రీ
అందరికీ ధన్యవాదాలండి
చాలా బాగుంది
Post a Comment