హ్యాపీ బర్త్ డే
ఈ రోజు నా పుట్టినరోజు.నాకెంతో ఇష్టమైన ఈబ్లాగ్ పుట్టినరోజు కూడా
జీవితం చాలా చిన్నది,కానీ చాలా విలువైనది.ఎంతో అపురూపమైనది.ఇంత అందమైన జీవితం ఓ తీయనిపాటలా,సెలయేటి గలగలలా సాగిపోతే అంతకు మించి కావలసింది ఏముంది.ప్రతిక్షణం జీవితాన్నిజీవించాలనే చిన్నిఆశ.
ఇది తీరాలంటే జీవితాన్నిప్రేమించాలి చిన్నచిన్నఆనందాలను,వాటిలోని
అనుభూతులను ఆస్వాదించగలగాలి.
ఇది తీరాలంటే జీవితాన్నిప్రేమించాలి చిన్నచిన్నఆనందాలను,వాటిలోని
అనుభూతులను ఆస్వాదించగలగాలి.
సమస్యలూ,కష్టాలూ,కన్నీళ్లు ఇవీ జీవితంలో ఓ భాగమే.ఎవరో అన్నట్టూ కష్టంస్ అండ్ సుఖంస్ ఈజ్ ది కాంబినేషన్ అఫ్ లైఫ్,కాకపోతే కొన్ని చిన్న సమస్యలు,కొన్నిపెద్ద సమస్యలు.ఎవరికైనా తప్పవు.ఇవన్నీఎప్పుడూ ఉండేవే.మిగతారోజులన్నీఎలా గడిచినా సంవత్సరంలో ఒక్కరోజు,మనకి మాత్రమే సొంతమైన పుట్టినరోజున మాత్రం అన్నిచికాకులనీ పక్కన పెట్టి హాయిగా ఆనందంగా గడిపితే మనసుకి తృప్తిగా ఉంటుంది.
పోయిన ఏడాది ఇదేరోజున ఈబ్లాగ్ మొదలుపెట్టి కూడలిలో చేర్చికొత్త ప్రపంచంలోకి వచ్చాను.ఆ ఉద్వేగం,ఉద్విగ్నతతోనే ఆరోజు గడిపాను.ఇవ్వాళా మనసులో అదే అనుభూతి చుట్టుముడుతోంది.ఏడాదికాలం చాలా త్వరగా గడిచిపోయినట్టు ఉంది.ఆత్మీయంగా ఆదరించిన అందరికీ నా ధన్యవాదాలు.
నిజానికి నా ప్రపంచం చాలా చిన్నది.ఏం చేయాలో తెలియని ఒంటరితనంలో కొట్టుకుపోతున్నతరుణంలో ఈబ్లాగ్స్ నాకు ఊరటనిచ్చాయి.నా మనసులో తోచిన భావాలను ఇందులో రాసుకుంటూ వచ్చాను.వంట చేయడం ఇష్టం కావడంతో "అభిరుచి"మొదలుపెట్టాను.నాకంటూ ఒక వ్యాపకం ఏర్పడింది.
కొంతమందికైనా నన్నుపరిచయం చేసింది.ఇందుకు చాలాచాలా సంతోషంగా ఉంది.థాంక్ యూ ఒన్స్ ఎగైన్.
కొంతమందికైనా నన్నుపరిచయం చేసింది.ఇందుకు చాలాచాలా సంతోషంగా ఉంది.థాంక్ యూ ఒన్స్ ఎగైన్.
Post a Comment
18 comments:
జన్మదిన 'సుభా ' కాంక్షలు లత గారు. ఇదే రోజున బ్లాగు మొదలుపెట్టారు కదా..అందుకు మీ బ్లాగుకి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ మనసులో ఉన్న భావాలని ఇలాగే పరిచయం చేస్తూ ఉండాలని,అవి చదివి మా మనసుకు కూడా హాయి కలగాలని కోరుకుంటూ..
Dear Latha! Double 'happy birthday'
మీకూ, మీ బ్లాగుకూ జన్మదిన శుభాకాంక్షలు. Many More Happy Returns of the Day.
లత గారూ...
అయితే ఈ రోజు డబుల్ ధమాకా అన్నమాట. మీకూ, మీ మానస పుత్రికైన మీ బ్లాగుకీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ బ్లాగ్ప్రయాణం ఇలాగే సంతోషంగా సాగిపోవాలనీ, మీరు మరిన్ని ఆనందాలు మీ సొంతమవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మీక్కూడా పాటలు వినడమంటే చాలా ఇష్టం కదూ.. మీకోసం ఒక బర్త్ డే సాంగ్..
http://www.youtube.com/watch?v=p0yASRak8Sc
Once again happy happy birthday to you! :)
పుట్టినరోజు శుభాకాంక్షలు ..
మీ ఇద్దరికీ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు లత గారు. మీ అభిరుచిలో చాలా వంటలే చేసాను. అలాగే మీ నిదురించే తోటలో ఎన్నో విషయాలు చూసాను. మీ తోట కలకాలం ఇలాగే పచ్చగా ఉండాలి.
Happy Birthday to you and your blog.. Enjoyyyyy
మీ బ్లాగ్ మీ పుట్టినరోజు నాడే చూసాను. కవితలు చాలా బావున్నాయి. మా అందరి మధ్య ఇలాంటి పుట్టినరోజులెన్నో జరుపుకోవాలని మీ ఇరువురికీ మా జన్మదిన శుభాకాంక్షలు.
హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు అందించిన మిత్రులందరికీ ధన్యవాదాలండీ
మీ అభిమానం,స్నేహం ఎప్పటికీ మరచిపోలేను
మధురా పాట ఇప్పుడే విన్నాను చాలా నచ్చింది.మంచి పాట తెలియచేసినందుకు థాంక్ యూ
లత గారు
మీకు , మీ బ్లాగ్ కి సంకలిని తరుఫున జన్మ దిన శుభాకాంక్షలు
సంకలిని హోం పేజి లో మీకు గ్రీటింగ్స్ చెప్పాము
ఇందులో వంటల విభాగం లో మీ బ్లాగ్ చదువుతున్నాను కానీ ఈ బ్లాగ్ కూడామీదే అని ఇప్పుడే తెలిసింది
ధన్యవాదాలండీ
లత గారూఉ...మీకు, మీ బ్లాగుకి హాప్పి హాప్పి బర్త్ డే :) నేను,చందు మీకు వీరాభిమానులం :) మాకేదైనా వెరైటి వంట చేసుకోవాలంటే ఇదివరకు గూగుల్ వెతికే వాళ్ళం..ఇప్పుడు లత గారి బ్లాగ్ :) మా చందు చేత ఒక బ్రెడ్డు వంటకాన్ని తినిపించగలిగిన ఏకైక వ్యక్తి మీరే :)))) అమెరికా దేశం వల్లే కానిది మీ వల్ల అయింది :) ఇదే కాదుగానీ..మీ నిదురించే తోటలో టపాలు కూడా ఎంతో సున్నితంగా.....సుతిమెత్తగా పిల్లగాలిలా మనసుని అలా తాకి వెళ్ళిపోతాయి. ఈ బ్లాగింగ్ మీకు వ్యాపకమైనా మీలాంటి అరుదైన బ్లాగర్ మాకు దొరకడం మా బ్లాగర్ల అదృష్టం :) మీరు,మీ మానసపుత్రిక అదే మీ బ్లాగు ఇలాగే కలిసి మెలిసి బోలెడు పుట్టినరోజు పండగలు చేసుకోవాలని కోరుకుంటూ......ఇంకోసారి బర్త్ డే విషెస్ ఫ్రం ఇందు-చందు :)
అమ్మో ఇందూ
నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు.అస్సలు మాటలు రావడం లేదు
మీకు,చందు గారికి థాంక్యూ వెరీమచ్
Many many happy returns of the day latagaaroo, meekoo mee blog koo kooDaa:))
మీకూ , మీ బ్లాగ్ కూ పుట్టినరోజు శుభాకాంక్షలు .
సారీ కొంచం లేట్ గా చెపుతున్నాను .
సునీతగారు థాంక్యూ
అయ్యో సారీ ఎందుకు మాలగారూ,మీ ఆశీస్సులే చాలు థాంక్యూ
లతా గారు మీకు మీ బ్లాగ్ కి కూడా పుట్టిన రోజు సుభాకాంక్షలు.ఇలాంటి పుట్టిన రోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..
Post a Comment