Wednesday, September 21, 2011

మరల తెలుపనా ప్రియా

అద్భుతమైన పాట.ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.ప్రతిసారీ ఓ అందమైన అనుభూతి మనసుని 
తాకి ఊయలలూగిస్తుంది.ఓ కన్నెమనసు నునుసిగ్గుల బరువుతో,దాచుకోలేని భావాలని పాటలో వెల్లడి చేస్తే ఎదలోయలలో పరిమళాలు,కనుపాపల్లో పరిచయాలు,మనసుపడే తడబాటు,కనురెప్పల నీడల్లోని బిడియాలు ఇలా ఎన్ని అనుభూతులు అలవోకగా మనసుని తాకి,మనని పలకరించి గిలిగింతలు పెడతాయో.ఎంతో చెప్పాలనుకున్నా  ఒకోసారి మాటలు దొరకవు.ఏం చెప్పాలో తెలియక మనసు పరితపిస్తుంది అలాంటప్పుడు మౌనమే మాట్లాడుతుంది.

"మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి,తెలియలేక తెలుపలేక మనసు పడే మధురబాధ" .
ఎంత చక్కని సాహిత్యమో.చిత్ర స్వరంలో ప్రాణం పోసుకుని జాలువారుతుంది.









మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా 
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా 
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని 
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని 
కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని 
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా 

విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని 
విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని
అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని
అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని

మరల తెలుపనా ప్రియా
మరల తెలుపనా


నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూసి
నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూసి
మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి
మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన ,మరుక్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసుపడే మధురబాధ

మరల తెలుపనా ప్రియా
మరల తెలుపనా 


ఈ పాట కంపోజ్ చేసినది వందేమాతరం శ్రీనివాస్ అన్నప్పుడు మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.ఆయన చేసిన మిగతా పాటలకు భిన్నంగా లలితంగా ఉంటుంది.అలాగే ఇందులో అసలు నచ్చనిది ఈ పాట చిత్రీకరణ.అంత అందంగా ముగ్ధంగా ఉన్న లయ ఒక్కదానిపై ఏ విరబూసిన వెన్నెల్లోనో తీయక,ఆ పార్కుల్లో, మధ్యలో మూడో వ్యక్తిని(బ్రహ్మాజీని) పెట్టి , ఏమిటో అర్ధం కాదు.ఇంకా అందంగా చిత్రీకరిస్తే బావుండేది అనిపిస్తుంది. అందుకే వీడియో చూడబుద్ధి కాదు.




Post a Comment

11 comments:

Unknown

మీరు చెప్పింది నిజం లతా గారు.ఈ పాట చిత్రీకరణ నాకు కూడా నచ్చలేదు.ఎంతో లలితంగా చిత్రికరించాల్సింది కామెడి పాటలా చిత్రించారు.ఇది ప్రక్కన పెడితే పాట మాత్రం అద్భుతం.

కృష్ణప్రియ

Beautiful! నాకు తెగ నచ్చిన పాటల్లో ఇదొకటి. మీరన్నట్టు వందేమాతరం శ్రీనివాస్ పాట అని నమ్మబుద్ధి కాదు.మాతృక వేరేది ఉందేమో..

మాలా కుమార్

బాగుంది పాట . ఇది ఏ సినిమాలోది ?

వనజ తాతినేని/VanajaTatineni

manchi paata. same feeling..Lata gaaru

Anonymous

ముందుగా మీ అభిరుచికి నా అభినందనలు. నమ్మరేమో కానీ ఈ పాట పాడుకోని రోజంటూ లేదు. నిజంగానే. చిత్రగారి గొంతులో ఆ పాత వింటూ వుంటే పని వొత్తిడిని నుంచి నేను బాగా రిలాక్సు అవుతాను. థాంక్ యు వెరీ మచ్ మీరీ పాట గురించి టపా రాసినందుకు.

లత

అవును శైలు
మాత్రుక గురించి తెలియదు కృష్ణప్రియగారు
మాలగారు
లయ,వేణు నటించిన స్వయంవరం సినిమాలోదండి ఈ పాట
వనజగారు,తొలకరిగారు
థాంక్యూ

ఆత్రేయ

మంచి సాహిత్యం, సంగీతాల సమ్మేళనం.
నిజమే లలితంగా ఉంటుంది.
పాట చిత్రీకరణ విషయం లో నేను ఈ విధం గా అనుకున్నా..
నిజానికి నాకు నచ్చింది ఈ పాట చిత్రీకరణ.
లయ మనసు వేణు కి తెలిపే ప్రక్రియ లో .. వేణు వ్యక్తిత్వం కూడా లయ కు తెలియ చెప్పే సంఘటనలు, బ్రహ్మాజీ ప్రసక్తిని తొలగించే ప్రయత్నాలు చేసారు.
ముతగ్గా, మూర్ఖం గా కనిపించే వేణు పాత్ర లోపల అందంగా దాగున్న దయాగుణం, సంస్కారం, లలితమైన హాస్యం, చూపించే చిత్రీకరణ. లయ కు నచ్చేలా చూపటానికి
నిజజీవితం లో కూడా మనలో చాలామంది కి ఎదురయ్యే పరిస్థితి....
బాగా ఘంభీరంగా ఉండాల్సిన చోట ఒక్కోసారి లోపల్నుంచి నవ్వు తన్నుకు రావటం,
సరదాగా గడపాల్సిన సమయం లో లోపల ఏదో బాధ తొలిచేస్తూ ఇబ్బంది పెట్టటం లాంటిదేమో ఈ పాటలో కాంట్రాస్ట్ కూడా.
ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వాళ్ళ మనసులో అందని లోతులుంటాయని.
సేరియాస్ గా ఉన్నట్టు కనపడే మేధావులు చాలాసార్లు జీవితాన్ని"కాకీక" అంత వ్యర్ధంగా గడుపుతారని అనిపిస్తుంది.
అప్రస్తుత ప్రసంగం అనుకున్నా, కొంచం తేడాగా ఆలోచిస్తున్నా అనుకున్నా నాకు మాత్రం మిగతా పాటల్లోని కుప్పిగంతులు, ఊరువు తాడింపుల కన్నా ఈ పాట లో వాళ్ళ నడక అందంగా అనిపించింది.

అయితగాని జనార్ధన్

బాగా చెప్పారు.

మధురవాణి

లత గారూ..
మనిద్దరం ఒకేసారి భలే తల్చుకుంటామండీ ఒకే పాటని గురించి. ఇదివరకొకసారి కూడా ఇలానే జరిగింది కదా.. ఈ రోజు పొద్దున్నే బజ్లో గుర్తు చేస్కున్నా ఈ పాటని.. :))
https://plus.google.com/112876752388666096938/posts/jhKdymXWrLB

శిశిర

>>>ఎంతో చెప్పాలనుకున్నా ఒకోసారి మాటలు దొరకవు.ఏం చెప్పాలో తెలియక మనసు పరితపిస్తుంది అలాంటప్పుడు మౌనమే మాట్లాడుతుంది.<<<

True. :)

Telugu Web World

your collection of movie lyrics are too good.
why u stopped new postings.
keep posting one post a day plz.
your recipes are very good.

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008