ఊహలన్నీ ఊసులై
మది లోపలి ఊహలన్నీ
మౌనపు అంచున దాగి
పెదవి దాటనంటున్నాయి
గుండెలోని సవ్వడులన్నీ
కలలకౌగిట్లో,కనురెప్పల నీడల్లో
దోబూచులాడుతున్నాయి
ఎదలోపలి అనుభూతులన్నీ
నిశిరాతిరి తారకలై,నిశీధిలో వేకువలై
నిట్టూర్పుల జడివానలో
తడిసిపోతున్నాయి
నా ఊహలన్నీ ఊసులై
మూగబోయిన వీణలై
పల్లవించని పాటలై
నిదురించేతోటలో నిశ్శబ్దరాగాన్ని
ఆలపిస్తున్నాయి
Post a Comment
10 comments:
Nice! :)
మీ కవిత బాగుందండి .
nic
మధురా, మాలగారు, రాజుగారు
థాంక్స్ అండి
మీ నిదురించే తోటలోని నిశ్శబ్ద రాగాల సవ్వడి మా మనసులని తాకుతూందండీ. బాగుంది.
>>నా ఊహలన్నీ ఊసులై
మూగబోయిన వీణలై
పల్లవించని పాటలై
నిదురించేతోటలో నిశ్శబ్దరాగాన్ని
ఆలపిస్తున్నాయి
అబ్బ! భలే రాసారండీ :)
శిశిరా, ఇందూ
థాంక్యూ
చాలా చాలా బాగుంది మేడం
మీ కవితలు చాలా బాగున్నాయి .. కొన్ని లైన్స్ ఐతే మళ్ళి మళ్ళి చదవలనిపిస్తున్నాయి ..... thats nice ...
తేజగారూ ,థాంక్యూ వెరీమచ్
Post a Comment