ప్లాస్టిక్ కవర్స్
చాలా సంవత్సరాల తరువాత చేతిలో బాగ్ తో బయటికి వెళ్ళడం.దాదాపు పదిహేనేళ్ళు దాటిందేమో,ఊపుకుంటూ వెళ్లి అన్నీ కవర్లలో తెచ్చుకోడం మొదలుపెట్టి.
రేపటినుండి మేము కవర్లు ఇవ్వము ఆంటీ మీరే తెచ్చుకోండి అని ప్రతివాళ్ళూ నిన్నేచెప్పేసారు.దాంతో ఈపూట గుర్తుపెట్టుకుని బాగ్ తీసుకువెళ్తుంటే
గమ్మత్తుగా అనిపించింది.బజార్లో కూడా తెచ్చుకోనివాళ్ళు అయ్యో
అనుకుంటూ,ఒక పెద్దాయన జామపళ్ళు జేబులో నింపుకోలేక అవస్థ
పడుతూ, మొత్తానికి ఇవన్నీ చూస్తే కొంచెం నవ్వొచ్చింది కూడా.ఎంతగా అలవాటు పడిపోయాము అని ఆశ్చర్యం కూడా వేసింది.నాలుగు రోజులు ఇలా ఉంటుంది తరువాత అదే అలవాటు అయిపోతుంది.ఇదివరకు తెచ్చుకునే వాళ్లమేగా అంటున్నారు అంతా.
పడుతూ, మొత్తానికి ఇవన్నీ చూస్తే కొంచెం నవ్వొచ్చింది కూడా.ఎంతగా అలవాటు పడిపోయాము అని ఆశ్చర్యం కూడా వేసింది.నాలుగు రోజులు ఇలా ఉంటుంది తరువాత అదే అలవాటు అయిపోతుంది.ఇదివరకు తెచ్చుకునే వాళ్లమేగా అంటున్నారు అంతా.
చిన్నప్పుడు పెద్దపెద్ద వైరు బుట్టలు తీసుకుని విజయవాడ వెళ్లి మరీ పచారీ కొట్లో సరుకులు కట్టించుకుని తెచ్చుకునేవాళ్ళం.ఆ రోజులన్నీగుర్తొచ్చాయి.ఏది ఏమైనా ఈసారన్నా అందరూ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గి, ప్రకృతికి ఎంతో కొంత మేలు జరిగితే అంతకన్నా కావలసింది ఏముంది.పనిలో పనిగా ఇంట్లో కూడా సగం చెత్త తగ్గుతుంది,
Post a Comment
6 comments:
"పనిలో పనిగా ఇంట్లో కూడా సగం చెత్త తగ్గుతుంది"
ఇది మాత్రం నిజమండి. ఇంట్లో ఎక్కడ చూసినా ఈ కవర్లే.
నిద్రపోతున్న వాళ్ళని..మేల్కొల్పడం,మేల్కొని బద్దకించే వాళ్ళని ముందుకు నెట్టినంత పనిగా.. ప్లాస్టిక్ నిషేధం జరుగుతుంది. అందుకు..సంతోషం. పూర్తి నిషేధం జరిగితే.. బాగుంటుంది. అవగాహన కూడా రావాలి. పోస్ట్ బాగుంది లతా గారు.
ఇవ్వాళే నేనూ ఇంటికొచ్చేప్పుడు షాప్ కెళ్ళి రెండు మూడు సామాన్లు తీసుకున్నాను. షాప్ వాడు అన్నీ నాముందు తోసేసి ఊరుకున్నాడు. వెంటనే గుర్తొచ్చింది, ఇవాల్టినుంచి బ్యాగ్ పట్టుకెళ్ళాలి అని. ఏం చేయను? నా హాండ్బ్యాగ్ లోనే అన్నీ సద్దేసి, జిప్ పట్టని బ్యాగ్ ని ఓపెన్ గానే తీసుకెళ్ళాను. అయ్యో నా బ్యాగ్ పాడైపోతొందే అని ఒకటే బాధ. నా అవస్థకి నాకే నవ్వొచ్చింది. గుర్తుంచుకోనందుకు ఇంతేకావాలిలే అనిపించింది. అదన్నమాట సంగతి.
నేను ఈ మద్యే మా పిల్లల పాత యునిఫార్మ్ తొ కొన్ని బాగులు కుట్టించాను . కాకపోతే ఈ రోజు బజారు కెళ్ళే పని పడలేదు :)
మా మనవరాలు కాగితం బాగులు కొన్ని చేసి వాళ్ళ ఇంటి పక్కనున్న కిరాణా షాప్ లో ఇచ్చి వచ్చింది :)
ఇక్కడితో పోలిస్తే ఇండియానే బెటర్ ఏమో ..మాకు మరీ దారుణం అండి వస్తువుకో కవర్ ఇస్తారు.ఎప్పుడూ వాళ్ళకు నాకు కవర్స్ వద్దమ్మ తల్లీ అని చెప్పాల్సి వస్తుంది...మన భాషవాళ్ళకు అర్ధం అయి చావదు..ఇంటికి తీసుకొచ్చి రీసైకిల్ బ్యాగ్లో వేసి బయట పెడతాను ..కాని అన్నన్ని కవర్స్ చూస్తుంటే బెంగగా ఉంటుంది
అవును శిశిరా, ఒకోసారి విసుగొస్తుంది
వనజగారు, ఈ సారి జరుగుతుందనే అనిపిస్తోందండి చూద్దాం
జయగారు,మొదటి రోజు కదండి
మాలగారు, ముందే బాగ్స్ రెడీ చేసుకున్నారా
నేస్తంగారు అన్నేసి కవర్లు చూస్తే ముందు చిరాకు వచ్ఛేస్తుందండి
Post a Comment